By: ABP Desam | Updated at : 30 Jan 2023 03:57 PM (IST)
Edited By: Mani kumar
Image Crtedit:Gopichand Malineni/Instagram
నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఫైట్స్, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్నీ ఇరగదీయడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా దర్శకుడు గోపీచంద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవ్. తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ‘వీర సింహారెడ్డి’ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. సినిమా ఆయనకు బాగా నచ్చడంతో తానే స్వయంగా ఈ సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనికు ఫోన్ చేశారు. సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. స్వయంగా రజనీకాంత్ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో గోపిచంద్ హర్షం వక్తం చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తన ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకున్నారు. దీంతో అటు ఆయన అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు.
గోపిచంద్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇది నమ్మలేని క్షణం. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి నాకు కాల్ వచ్చింది. మా ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఆయన వీక్షించారు. ఆయనకు మా సినిమా నచ్చింది. మా మూవీను ప్రశంసిస్తూ రజనీ చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో నాకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్’’ అంటూ ట్వీట్ చేశారు గోపీ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మంచి ఛాన్స్ కొట్టేశావ్ గోపీచంద్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ‘వీర సింహారెడ్డి’ సినిమా విడుదల అయిన తొలిరోజు నుంచే మాస్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో బాలయ్య గెటప్, డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూకట్టారు. అలాగే సినిమాకు ప్రధాన బలం ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్. సినిమాలో ఫైట్స్ సీన్స్ కు థమన్ అందించిన మ్యూజిక్ కూడా తోడవ్వడంతో థియేటర్లు దద్దరిల్లాయి. రామ్ లక్ష్మణ్ ల ఫైట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ‘అఖండ’ లాంటి మాస్ హిట్ తో బాలయ్య, ‘క్రాక్’ లాంటి హిట్ తర్వాత గోపిచంద్ మలినేని కలసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాలో బాలయ్యను అదే రేంజ్ లో చూపించారు దర్శకుడు. అందులోనూ గోపిచంద్ బాలయ్య ఫ్యాన్ కావడంతో బాలయ్య అభిమానులకు తగ్గట్టుగా ఆయన పాత్రను రూపొందించారు. అందుకే మూవీ కు మొదట్లో మిక్సిడ్ టాక్ వచ్చినా బాలయ్య అభిమానులకు మాత్రం మాస్ బిర్యానీ ల అనిపించింది. అందుకే దాదాపు 127 కోట్ల లాభంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
Read Also: ‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
This is a surreal moment for me🤩🤗
— Gopichandh Malineni (@megopichand) January 29, 2023
Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film.
His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి