అన్వేషించండి

Buddy: కొత్త సినిమాటిక్ యూనివర్స్‌లో సందీప్ కిషన్ - సైన్స్‌ఫిక్షన్ జోనర్‌లో సూపర్బ్ ఐడియాతో!

సందీప్ కిషన్ తన లేటెస్ట్ సినిమా ‘బడ్డీ’ని అధికారికంగా ప్రకటించారు.

Sundeep Kishan New Movie: సంక్రాంతి సందర్భంగా సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ విడుదల అయింది. తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ‘బడ్డీ’ అనే సినిమాకు సందీప్ కమిటయ్యాడు. ఈ సినిమా పోస్టర్ చూడటానికి ఆర్య గతంలో నటించిన ‘టెడ్డీ’ తరహాలో ఉంది. చేతిలో గన్‌తో, పక్కనే టెడ్డీ బేర్‌తో ఉన్న సందీప్ కిషన్‌ను ఈ పోస్టర్‌లో చూడవచ్చు.

అయితే ఈ సినిమా ‘టెడ్డీ’ రీమేక్ కాదని, పూర్తిగా కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సందీప్ కిషన్ తెలిపారు. కానీ ఈ కథ పూర్తిగా ‘టెడ్డీ వరల్డ్’లోనే జరుగుతుందని తెలిపాడు. దీన్ని బట్టి సౌత్ ఇండియాలో ఇది కొత్త సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పవచ్చు.

ఇక ‘టెడ్డీ’ విషయానికి వస్తే... ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ తాను బతికుండగానే టెడ్డీ బేర్‌లో ప్రవేశించి హీరో ద్వారా తన ప్రాణాలు కాపాడుకుంటుంది. హీరో పాత్రలో ఆర్య, కోమాలో ఉన్న అమ్మాయి పాత్రలో సయేషా సైగల్ నటించారు. ఇప్పుడు ‘బడ్డీ’లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు.

నిజానికి ఈ సినిమాను హడావుడిగా ప్రకటించాల్సి వచ్చింది. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న తెలుగు సినిమాలను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాను కూడా లిస్ట్ చేసింది. దీంతో సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేశాడు. విషయం బయటకు వచ్చేసింది కాబట్టి అధికారికంగా ప్రకటిస్తున్నామని ట్వీట్ చేశాడు.

‘మైకేల్’, ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాల తర్వాత ఈ సినిమాలో నటించనున్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు. ‘మైకేల్’ సినిమాను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది విడుదల కానుంది. తర్వాతి సినిమా ‘ఊరు పేరు భైరవ కోన’కు విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అని తెలుస్తోంది.

‘బడ్డీ’ సినిమాను కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘బడ్డీ’ ఎప్పుడు విడుదల కానుందో తెలియరాలేదు. ‘మైకేల్’ విడుదల తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Bhopal Event Live Updates: 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్... మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి
'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్... మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి
TN 2026 OTT : 4 ఓటీటీల్లో లేటెస్ట్ పొలిటికల్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
4 ఓటీటీల్లో లేటెస్ట్ పొలిటికల్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Peddi Ticket Rates: పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ
పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ
Jana Nayagan : విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ - ప్రొడ్యూసర్ రియాక్షన్
విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ - ప్రొడ్యూసర్ రియాక్షన్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
Crime Thriller OTT : అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
Elephant damages cars Thrissur: త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
Donald Trump Buffalo Bangladesh: హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందని బర్రెకు ట్రంప్ పేరు పెట్టారు - బాగానే ఉంది కానీ బక్రీద్‌కు కోసుకు తినేస్తారట - బంగ్లాదేశ్‌ వాళ్లకు భయం లేదా?
హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందని బర్రెకు ట్రంప్ పేరు పెట్టారు - బాగానే ఉంది కానీ బక్రీద్‌కు కోసుకు తినేస్తారట - బంగ్లాదేశ్‌ వాళ్లకు భయం లేదా?
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Embed widget