Radhe Shyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'కి రాజమౌళి వాయిస్ ఓవర్
ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా తెలుగు వెర్షన్‌కి దర్శక ధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ చెప్పారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన 'రాధేశ్యామ్'(Radheshyam) సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రం తమన్ ను రంగంలోకి దింపారు.
ఇక ఈ సినిమాకు నెరేషన్‌ను ఒక్కో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కో సెలబ్రిటీతో చెప్పించారు. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ హిందీ వెర్షన్ కి వాయిస్ ఓవర్ పూర్తి చేశారు. తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్‌ను రాజమౌళితో చెప్పించడం విశేషం. ప్రభాస్ కి 'బాహుబలి' లాంటి హిట్టిచ్చిన దర్శకధీరుడితో 'రాధేశ్యామ్' సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కన్నడ వెర్షన్ శివరాజ్ కుమార్(Sivaraj Kumar), మలయాళ వెర్షన్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prudhviraj Sukumaran) లతో వాయిస్ ఓవర్ చెప్పారు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
View this post on Instagram