అన్వేషించండి

SS Rajamouli: రాజమౌళికి మరో అరుదైన గౌరవం - ఆ జాబితాలో స్థానం

ప్రస్తుతం రాజమౌళికి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ టాప్ 100 లిస్ట్ లో చోటుదక్కించుకున్నారు.

టాలీవుడ్ దిగ్గజ దర్శుకుడు రాజమౌళి మరో అరుదైన ఘనత సాధించారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుందీ మూవీ. అంతే కాదు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సినిమా పేరు కొన్ని నెలలు పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. దర్శకుడు రాజమౌళికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు రాజమౌళి మరో ఘనత సాధించారు. టైమ్స్ మ్యాగిజైన్ ప్రకటించిన ‘టాప్‌-100 వరల్డ్‌ ఇన్ల్ఫూయెన్షిల్‌ పీపుల్‌’ జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. ఇది తెలుగు వారంతా హర్షించదగ్గ విషయం. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో మరోసారి ప్రపంచం చూపు టాలీవుడ్ పై పడింది. 

ప్రస్తుతం రాజమౌళికి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ టాప్ 100 లిస్ట్ లో చోటుదక్కించుకున్నారు. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మీ భారత్‌ నుంచి ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కింగ్‌ చార్లెస్‌, ఎలాన్‌ మస్క్‌, సాకర్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ తదితర ప్రముఖులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో బాలీవుడ్ నటి అలియా భట్ రాజమౌళి గురించి చెప్పుకొచ్చింది. భిన్న సంస్కృతులు ఉన్న ఈ సువిశాల భారతదేశాన్ని ఒక్క సనిమాతో ఒక్కటి చేసి చూపించారని రాజమౌళి గురించి వివరించింది అలియా. అటు షారుఖ్ ఖాన్ కు కూడా బాలీవుడ్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఆయనతో కలసి ఇటీలవ ‘పఠాన్’ సినిమాలో నటించిన దీపికా పదుకోణ్ షారుఖ్ ను ప్రశంసలతో ముంచెత్తింది. పలువురు సినీ ప్రముఖులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

2023 ఏడాదికి గానూ టైమ్స్ నిర్వహించిన ఈ పోలో లో ఓ తెలుగు దర్శకుడు చోటు దక్కించకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో రాజమౌళి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతోనే రాజమౌళి కెపాసిటీ ఎంటో ప్రపంచానికి అర్దమైంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకున్నారు రాజమౌళి. ఈ సినిమాతో ఆయనకు అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక నుంచి ఆయన తీసే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయని టాక్ నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నారు. మొదట ఈ సినిమాను ఒక భాగంలోనే తీయాలని అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తో రాజమౌళి క్రేజ్ పెరిగిపోవడంతో అందులో మార్పులు చేసి భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించారు. దీంతో ఈ మూవీను మూడు పార్ట్ లుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరి ఈసారి రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
Godavari Serial Today October 7th: 'గోదావరి' సీరియల్: సంజయ్ నెత్తి మీద కాఫీ పెట్టి ఆట పట్టించిన జాను! జాబ్ వేటలో నందు!
'గోదావరి' సీరియల్: సంజయ్ నెత్తి మీద కాఫీ పెట్టి ఆట పట్టించిన జాను! జాబ్ వేటలో నందు!
The Paradise OTT: ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్? ఈ నెలలో ఎప్పుడంటే?
ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్? ఈ నెలలో ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today October 7th: నిండు మనసులు: తండ్రి చేసిన పనికి బ్యాగ్ సర్దేసిన ప్రేరణ! గణ ప్రేరణకు పంపిన ఫొటో ఎవరిది?
నిండు మనసులు: తండ్రి చేసిన పనికి బ్యాగ్ సర్దేసిన ప్రేరణ! గణ ప్రేరణకు పంపిన ఫొటో ఎవరిది?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget