News
News
X

Boycott Bollywood: ప్రేక్షకులను గౌరవించాలి, షారుఖ్ కామెంట్స్ వైరల్ - కరీనా, అలియాలపై మళ్లీ ట్రోల్స్!

బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ నేపథ్యంలో గతంలో షారుఖ్ ఖాన్ ఆడియెన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ తను ఏమన్నారంటే..?

FOLLOW US: 

బాయ్ కాట్ ట్రెండ్ మీద కరీనా కపూర్, ఆలియా భట్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.. ఈ నేపథ్యంలో సినిమా ఆడియన్స్ గురించి షారుఖ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మొదలైన ఈ ఉద్యమం.. రోజురోజుకు మరింత ఉధృతం అవుతుంది. తాజాగా బాయ్ కాట్ దెబ్బకు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా అడ్డంగా బుక్కైంది. వందల షోలు రద్దయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని చవిచూసింది. త్వరలో రాబోతున్న బ్రహ్మాస్త్ర, విక్రమ్ వేద వంటి పలు సినిమాలకు బాయ్ కాట్ దెబ్బ బాగానే తగిలే అవకాశం కనిపిస్తోంది.

లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోయిన్ నటించిన కరీనా కపూర్ ఖాన్.. బాయ్ కాట్ ఉద్యమం మీద తీవ్ర స్థాయిలో  విరుచుకుపడింది. ‘‘మీకు నచ్చకపోతే సినిమా చూడకండి’’ అంటూ ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత తను సారీ చెప్పినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆమె బాటలోనే అలియా భట్ కామెంట్స్ చేసింది. ‘‘మీరు నన్ను ఇష్ట పడకపోతే.. చూడకండి’’ అని  కామెంట్స్ చేసింది. దీంతో ఈమె వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు బ్రహ్మాస్త సినిమా మీద ఓ రేంజిలో పడే అవకాశం కనిపిస్తోంది. ఆమె వ్యాఖ్యలతో నిర్మాతలు తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు అర్జున్ కపూర్  కూడా బాయ్ కాట్ ట్రెండ్ మీద స్పందించాడు. ఇండస్ట్రీ వ్యక్తులు ఈ  ఉద్యమం గురించి మౌనంగా ఉండటం చాలా తప్పు అన్నారు. ఇప్పటికైనా అందరూ  కలిసి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలన్నారు. ఈయన వ్యాఖ్యల మీద కూడా నెటిజన్లు భారీగా ట్రోల్ చేశారు.

ఈ ముగ్గురు స్టార్ల మీద నెటిజన్ల కామెంట్స్ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ గతంలో ప్రేక్షకుల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నటులు ప్రేక్షకులను ఎలా గౌరవించాలనేది షారుక్ వెల్లడించారు. 2016లో జరిగిన ఒక ఈవెంట్‌లో షారుఖ్ ఈ కామెంట్స్ చేశారు.  “సినిమాకు అవసరమైన కథలను తయారు చేయడానికి చాలా ఏళ్లు పనిచేస్తాం. ఆ తర్వాతే సినిమాలను తెరకెక్కిస్తాం. అందుకు ఎంతో కష్టపడుతాం. ఎంత చేసినా సినిమాలు చూసే వ్యక్తులు మనకు చాలా ముఖ్యం. ఉదయం లేవగానే ప్రేక్షకుల పట్ల గౌరవంగా ఉండాలి. ప్రేక్షకులు నా సినిమాలను అర్థం చేసుకోరని వారిని అపార్థం చేసుకోవద్దు. వారు ప్రతిదీ అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను” అని ఆయన చెప్పారు.

షారుఖ్ ఖాన్ వ్యాఖ్యల మీద నెటిజన్లు స్పందిస్తున్నారు.  "తన స్వంత సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా షారుఖ్... ఇప్పటి కుర్ర హీరోల తరహాలో ప్రవర్తించలేదు” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. “ మీరు మీ ప్రేక్షకులకు గౌరవం ఇచ్చినప్పుడు, మీరు వారి నుంచి తిరిగి గౌరవాన్ని పొందుతారు” అని మరో వ్యక్తి  కామెంట్ చేశాడు. షారుఖ్ ఖాన్ నాలుగు సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌తో పఠాన్, అట్లీ దర్శకత్వంలో జవాన్, రాజ్‌కుమార్ హిరానీతో  డంకీ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు 2023లో విడుదల కానున్నాయి.

Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!

Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?

Published at : 24 Aug 2022 08:59 PM (IST) Tags: Kareena Kapoor SRK AliaBhatt Arjun Kapoor Boycott Controversy

సంబంధిత కథనాలు

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల