'జెర్సీ' సినిమా గురించి, అందులో నాని క్యారెక్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. నానికి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ కథ హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి రెడీగా ఉంది. షాహిద్ కపూర్ హీరోగా 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. డిసెంబర్ 31న సినిమా విడుదల కానుంది.
'జెర్సీ'లో షాహిద్ క‌పూర్‌ది క్రికెటర్ రోల్. సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన ముఖానికి బాల్ తగిలింది. అప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు. దాంతో పెదవికి పెద్ద దెబ్బ తగిలింది. పాతిక కుట్లు పడ్డాయి. ముఖం మళ్లీ అంతకు ముందులా, నార్మల్‌గా కనిపిస్తుందని అనుకోలేదట. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన షాహిద్, ఈ విషయాలు వెల్లడించారు.
"నేను హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని అనుకున్నాను. నా జీవితంలో చేసిన తెలివితక్కువ పని అది. బాల్ నా కింది పెదవికి తగిలింది. దాని వల్ల రెండు నెలలు షూటింగ్ ఆపేశాం. నాకు పాతిక కుట్లు పడ్డాయి. నా ముఖం మళ్లీ ఇంతకు ముందులా కనిపిస్తుందని అనుకోలేదు. నా పెదవి నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వలేదనుకోండి. కొంత భాగానికి స్పర్శ తెలియడం లేదు. ఈ సినిమా కోసం నా రక్తం చిందించాను" అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు.
'అర్జున్ రెడ్డి' సినిమాను 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి... భారీ విజయం అందుకున్న షాహిద్ కపూర్, ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా 'జెర్సీ'ని రీమేక్ చేయడం విశేషం. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్, 'దిల్' రాజు, తెలుగు 'జెర్సీ' నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఉన్నారు.



Also Read: 'ఆచార్య'... రామ్ చరణ్ క్యారెక్టర్ 'సిద్ధ' టీజర్ వచ్చింది! చూశారా?
Also Read: అభిమానులూ... అలా చెయ్యొద్దు! - సల్మాన్ రిక్వెస్ట్
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైప‌ర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి