మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ఆచార్య' (Acharya). కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
టీజ‌ర్‌లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. అలాగే, ప్రేమతో పాటు చరణ్ ఫైట్ చేయడం చూపించారు. ప్రేయసితో సరసాలు, మల్ల యుద్ధంలో పోరాటాలు... రెండిటినీ లింక్ చేయడం బావుంది. టీజర్ చివరలో సిద్ధ మావోయిస్టుగా మారినట్టూ చూపించారు. ఒకరిని చంపినట్టూ చూపించారు. ఒక్క టీజర్‌లో చాలా విషయాలు పొందుపరిచారు దర్శకుడు కొరటాల శివ. అలాగే, 'ధర్మస్థలికి ఆపద వస్తే... అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని రామ్ చరణ్ చేత డైలాగ్ చెప్పించారు. 





చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన ఈ సినిమాలో సోనూ సూద్ కీలక పాత్ర చేశారు. ఆల్రెడీ 'లాహే... లాహే..' పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత  కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న (Acharya On Feb4th ) సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Acharya​ - Siddha's Saga Teaser:


Also Read: అభిమానులూ... అలా చెయ్యొద్దు! - సల్మాన్ రిక్వెస్ట్
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైప‌ర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి