స్టార్ హీరో సినిమా విడుదల అయ్యిందంటే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి ఒక రేంజ్‌లో ఉంటుంది. షో స్టార్ట్ అయ్యే ముందు థియేటర్ బయట క్రాకర్స్ కాలుస్తారు. బ్యాండ్ బాజా అరేంజ్ చేస్తారు. డ్యాన్సులు వేస్తారు. ఆ హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన 'అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్' (Antim: The Final Truth)సినిమా విడుదల అయ్యింది. ఉత్తరాదిన చాలా థియేటర్లలో సందడి సందడి నెలకొంది. అయితే, ఓ థియేటర్‌లో అభిమానులు మాత్రం ఓ అడుగు ముందుకు వేశారు. థియేటర్‌ లోపల క్రాకర్స్ (బాణా సంచా) కాల్చారు. ఆ విజువల్స్ సల్మాన్ ఖాన్ దృష్టికి వచ్చాయి. దాంతో అలా చెయ్యవద్దని ఆయన అభిమానులను రిక్వెస్ట్ చేశారు. థియేటర్ యాజనమాన్యాలను సైతం లోపలకు క్రాకర్స్ అనుమతించవద్దని కోరారు.


"ఆడిటోరియం (థియేటర్) లోపల క్రాకర్స్ కాల్చవద్దని నా అభిమానులు అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. అప్పుడు మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సినిమా హాలు లోపలకు ఫైర్ క్రాకర్స్ తీసుకు వెళ్లడానికి అనుమతించవద్దని, సెక్యూరిటీ వారు ఎంట్రీ పాయింట్ వద్ద లోపలకు తీసుకు వెళ్లకుండా ఆపాలని థియేటర్ యజమానులకు నా విన్నపం. సినిమాను అన్ని విధాలుగా ఆస్వాదించండి. కానీ, దయచేసి ఈ విధం (క్రాకర్స్ కాల్చడం వంటివి) చేయవద్దు. నా అభిమానులు అందరికీ ఇది రిక్వెస్ట్. థాంక్యూ" అని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.





సల్మాన్, అతని బావ ఆయుష్ శర్మ నటించిన ఈ 'అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్'కు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు.

Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైప‌ర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి