అన్వేషించండి

Maanas Engagement: శ్రీజతో అట్టహాసంగా మానస్ నిశ్చితార్థం, నెట్టింట్లో వీడియోలు వైరల్

సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం ఆయన నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. అతడి ఆటతీరుకు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒత్తిడిలోనూ ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా చక్కగా గేమ్ ఆడి అలరించాడు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ సీరియల్స్ లో బిజీ అయ్యాడు. కొన్ని ఆల్బమ్స్ తో పాటు షోలు కూడా చేస్తున్నాడు.

ఘనంగా మానస్, శ్రీజ నిశ్చితార్థం

తాజాగా మానస్ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శనివారం(సెప్టెంబర్ 2న) సాయంత్రం నిశ్చితార్థం జరుపుకున్నారు. శ్రీజ అనే అమ్మాయితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు.  ఈ మేరకు ఇద్దరూ పూల దండలు మార్చుకున్నారు. నిశ్చితార్థ వేడుకలో లైట్ పింక్ కలర్ డ్రెస్సుల్లో శ్రీజ, మానస్ మెరిసిపోతూ కనిపించారు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కి పలువురు టీవీ, సినిమా నటీనటులు హాజరయ్యారు. తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో మానస్ తో సన్నిహితంగా ఉన్న కాజల్, సన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.  

సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మానస్

ఇక తన ఎంగేజ్ మెంట్ గురించి మానస్ అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో కాబోయే భార్యతో కలిసి వెడ్డింగ్ రింగ్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ‘ఎంగేజ్డ్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. అటు మానస్, శ్రీజ జంట చూడ చక్కగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

మానస్, శ్రీజది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అంతేకాదు, మానస్ కు చేసుకోబోయే అమ్మాయి శ్రీజ గురించి కూడా వివరాలేవీ బయటకు రాలేదు. ఇంతకీ ఈమె ఎవరు అని వెతికే పనిలో ఉన్నారు నెటిజన్లు. నిశ్చితార్థం పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj)

సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్

ఇక సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. మంచి ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించాడు. ప్రస్తుతం ఆయన పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. టీవీ షోలు కూడా చేస్తున్నాడు. మధ్య మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు.     

Read Also: ఉత్తరాఖండ్ లో తలైవా జర్నీ, ఎంత కష్టపడి మహావతార్ బాబా గుహను చేరుకున్నారో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today July 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును అడ్డు తప్పించాలన్న మనోహరి – మనోహరి మాటలు విన్న అమర్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును అడ్డు తప్పించాలన్న మనోహరి – మనోహరి మాటలు విన్న అమర్‌  
Illu Illalu Pillalu Serial Today July 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గొడవ మొదలు పెట్టిన సేనాపతి! భోజనాలు దగ్గర టెన్షన్ టెన్షన్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గొడవ మొదలు పెట్టిన సేనాపతి! భోజనాలు దగ్గర టెన్షన్ టెన్షన్!
Jana Nayagan Collections: 'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget