అన్వేషించండి

ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన

దర్శకుడు రాజమౌళిపై ఓ సీనియర్ ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. నటి కాంచన రాజమౌళి తనను అవమానించేలా మాట్లాడాడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత పొగడ్తలతో పాటు  అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో సెలబ్రెటీల విషయంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. అందుకే సెలబ్రెటీలకు ఎప్పుడూ పూలే కాదు అప్పుడప్పుడూ రాళ్లు కూడా తగులుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతుంటాయి కూడా.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దర్శకుడు రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఇక ఆస్కార్ అవార్డు రాకతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి అండ్ టీమ్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అయితే ప్రస్తతం రాజమౌళి ఆ ఆనందంలో ఉండగా తాజాగా ఆయనపై ఓ సీనియర్ ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. నటి కాంచన రాజమౌళి తనను అవమానించేలా మాట్లాడారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

నటి కాంచన తెలుగు సినిమా రెండో తరం హీరోయిన్ లలో ఒకరు. ఆమె హీరోయిన్ గా తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ లు పడే ఆటుపోట్లు గురించి చెప్పుకొచ్చారు. దానితో పాటు ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి కూడా మాట్లాడారు కాంచన. ఈ క్రమంలో ‘బాహుబలి’ సినిమా సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు కాంచన.

‘బాహుబలి’ సినిమాలో ఓ పాత్ర కోసం రాజమౌళి తనను సంప్రదించారని చెప్పారు. రెండు రోజులు షూటింగ్ ఉంటుందని చెప్పారని, తాను అందుకోసం రూ.5 లక్షలు పారితోషికం అడిగానని అన్నారు. ఆ మాటకు రాజమౌళి కాసేపు ఆలోచించి అది మీకు చాలా ఎక్కువ అని అన్నారని చెప్పారు. ఆ పాత్రకు అంత ఇవ్వలేమని అవమానించినట్టు మాట్లాడారని వాపోయారు కాంచన. 

తనకు ఇవ్వాలి అనుకుంటే రాజమౌళి దగ్గర లేని డబ్బా అని వ్యాఖ్యానించారు. ముసలి హీరోల కోసం కోట్లు ఖర్చు చేస్తారని, ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దని ఆర్టిస్ట్ ల కష్టాలు అలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రూ.5 లక్షలు వాళ్ళకి పెద్ద ఎమౌంట్ కాకపోవచ్చు. కానీ అది తమకు చాలా పెద్ద ఎమౌంట్ అని చెప్పారు. తమకు ఇస్తే సేవకు ఉపయోగిస్తాం కదా అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో తనలాగ ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారని, ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేస్తారని, సినిమా రంగంలో ఆర్టిస్ట్ లు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంచన.  

నటి కాంచన తండ్రి వ్యాపారవేత్త. ఆయన మొదట్లో వ్యాపారంలో నష్టపోతే కాంచన ఎయిర్ హోస్ట్ గా ఉద్యోగం చేశారు. తర్వాత తన పరిచయాలతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. గతంలో తాను కొన్నేళ్లు తండ్రి ఆస్తి విషయంలో వివాదాలు నడిచాయి. అయితే తర్వాత ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తనకు వారసత్వంగా వచ్చిన తండ్రి ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థాననికి రాసిచ్చేశారు కాంచన. ఆమె వివాహం కూడా చేసుకోలేదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమె ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోకు నాన్నమ్మ పాత్రలో కనిపించారు. 

Also Read 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget