అన్వేషించండి
Seethe Ramudi Katnam Serial Today March 22:మిధున వేషంలో మహాలక్ష్మీ ఇంటికి వచ్చి ఆట ఆడుకున్న సీత, రామ్‌లో పశ్చాత్తాపం కలుగుతుందా?
Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మీ ఇంటికి వెళ్లిన మిధున ఏం చేసింది..? రామ్ గుండెల్లో సీత ఉన్నాడని తెలుసుకోవడానికి ఏం ఎత్తు వేసింది..?

సీతే రాముడి కట్నం సీరియల్ టుడే ఎపిసోడ్
Source : ZEE
Seethe Ramudi Katnam Serial Today Episode
గౌతమ్ వేలిముద్రలు ఎక్కడ దొరికిపోతాయోనని మహాలక్ష్మీ కంగారుపడుతుండగా....నా వేలిముద్రలు పోలీసులు దొరకవని...నువ్వు ఎలాంటి కంగారుపడాల్సిన అవసరం లేదని గౌతమ్ ఆమెను సముదాయిస్తాడు. అదెలా అని అడగ్గా...నేను అసలు వాళ్లకు తన వేలిముద్రలే ఇవ్వలేదని చెబుతాడు. అందరి ముందు ఇచ్చావు కదా అని ఆమె నిలదీయగా...తన చేతికి వేసుకున్న మాస్క్‌ను తీసి చూపిస్తాడు. ఇది చూసి మహాలక్ష్మీ షాక్‌కు గురవుతుంది. వేలిముద్రలు ఇచ్చే ముందు తాను వాష్‌రూంకు వెళ్లి చేసిన పని ఇదేనని చెబుతాడు. ఇప్పుడు నా వేలిముద్రలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లే అవకాశమే లేదంటాడు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణలు తనను పట్టుకోలేరని చెబుతాడు. మహాలక్ష్మీ హమయ్యా గండం గడిచిందని అనుకుటుంది.కానీ మిధున రూపంలో మరో గండం వస్తోందని...దానికి ఇంట్లో జరిగే ఏ విషయాలు తెలియకుండా మేనేజ్ చేయాలని కొడుకుతో చెబుతుంది.
ఈలోగా సీత మిథున రూపంలో మహలక్ష్మి ఇంటికి వస్తుంది. మిధునను చూసి సీత అనుకోని పిచ్చిపిచ్చిగా మాట్లాడిన వాచ్‌మెన్ చెంపను పగులగొట్టడం చూసి వచ్చింది నిజంగా మిధుననే అనుకుంటుంది మహాలక్ష్మీ. మిధునకు ఎదురేగి హారతి ఇచ్చి మహాలక్ష్మీ లోపలికి ఆహ్వానిస్తుంది. గోడమీద సీత ఫొటో చూసి ఎవరని అడుగుతుంది మిధున...తను సీత అని మహాలక్ష్మీ చెబుతుంది. సేమ్‌టూ సేమ్ తనలాగే ఉందంటుంది. సీతా,రామ్ కలిసి ఉన్న ఫొటో తీసి మిధున బయటకు విసిరేస్తుండగా...అప్పుడే బయట నుంచి గుమ్మంలోకి వచ్చిన రామ్ ఆ ఫొటో పట్టుకుంటాడు. ఫొటో విసిరేసినందుకు మిధునపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సీతను అనరానిమాటలు అంటున్న మిధునను నోరుమూసుకోవాలని రామ్ హెచ్చరిస్తాడు. నా భార్య గురించి ఇంకొక మాట అంటే సహించేది లేదని హెచ్చరిస్తాడు. సీతను ఎవరేమన్నా ఊరుకునేది లేదని ఇంట్లో వారందరినీ హెచ్చరిస్తాడు. అతిథి అతిథిలాగే ఉండాలని...ఇంట్లో విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటాడు. ఇంట్లో వాళ్లంతా సీత గురించి రకరకాలుగా చెప్పినా....రామ్ తన మనసులో సీతకు ఎప్పటికీ స్థానం ఉంటుందని అంటాడు. ఈ మాటలు వింటున్న సీత లోపల ఎంతో సంతోషిస్తుంది. గోడమీద నుంచి ఆ ఫోటొ ఇంకోసారి ఎవరైనా తీస్తే ఊరుకోనని చెప్పి వెళ్లిపోతాడు. రామ్ వెనకే తన గదిలోకి మిధున వెళ్తుంది. మీకు సీత అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి తీసుకుని రావొచ్చు కదా అని అడుగుతుంది. సీత అంటే ఇష్టం ఉన్నా...తన తప్పులను మాత్ క్షమించలేనని రామ్ అంటాడు. సీత అంత క్షమించరాని తప్పు ఏం చేసిందని నిలదీస్తుంది. అంత ప్రేమ ఉన్నప్పుడు సీతపై నమ్మకం కూడా ఉండాలి కదా అంటుంది. తను నిజంగా తప్పు చేసిందో లేదో ఆలోచించకుండా దూరం పెట్టడం చాలా దుర్మార్గమని ప్రశ్నిస్తుంది. దీంతో కోపంగా తన గది నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ రామ్ మిధునను ఆదేశించడంతో ఈరోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఐపీఎల్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion