Samantha: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సమంత!
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సమంత పాల్గొన్నట్లు సమాచారం.

బాలీవుడ్ లో 'కాఫీ విత్ కరణ్' షో ఎంత పాపులరో తెలిసిందే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ సినిమాను ఈ షోని హోస్ట్ చేస్తుంటారు. అయితే మొన్నామధ్య ఈ షోని ఆపేస్తున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి హడావిడి చేశారు. ఆ తరువాత ఈ షో ఓటీటీలో వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ ఓటీటీ వెర్షన్ కోసం సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు కరణ్ జోహార్. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, అనన్య పాండేలను ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం.
ఇప్పుడేమో స్టార్ హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేశారట. ఇటీవల ముంబైకి వెళ్లిన సమంత.. కరణ్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ షోలో కరణ్ చాలా వివాదాస్పద ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ ఇంటర్వ్యూ కారణంగా చాలా మంది సెలబ్రిటీలు చిక్కుల్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి సమంతను కరణ్ ఎలాంటి ప్రశ్నలు అడిగారో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. సమంతతో పాటు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పూజాహెగ్డే ఇలా టాప్ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గోనున్నారు. మరి సౌత్ సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?
Also Read: టెన్త్ ఫెయిల్ అయిన మంత్రి గన్ బిల్ పాస్ చేస్తే? - లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే' టీజర్ చూశారా?
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















