అన్వేషించండి
Samantha: నాగ చైతన్య టాటూ ఇంకా సమంత ఒంటిపైనే ఉందా? ఇది గమనించారా?
చైతుతో విడాకులు తీసుకున్న తరువాత ఈ టాటూని సమంత చెరిపేసుకుందని అందరూ అనుకున్నారు.
![Samantha: నాగ చైతన్య టాటూ ఇంకా సమంత ఒంటిపైనే ఉందా? ఇది గమనించారా? Samantha Still carries Nagachaitanya's Tattoo Samantha: నాగ చైతన్య టాటూ ఇంకా సమంత ఒంటిపైనే ఉందా? ఇది గమనించారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/08/e8d0ce8fd23e032f19d3b9f200dcb732_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాజీ భర్త టాటూ - ఇంకా సమంత ఒంటిపైనే
సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత.. ఆ బంధానికి సంబంధించిన మెమొరీస్ అన్నింటినీ చెరిపేసే ప్రయత్నం చేసింది. తన సోషల్ మీడియా పేజీల నుంచి నాగచైతన్యతో దిగిన ఫొటోలను డిలీట్ చేసింది. ముఖ్యంగా పెళ్లి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఫొటోస్ అన్నీ తీసేసింది. అలానే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన పెళ్లి కానుకులను కూడా వెనక్కి ఇచ్చేసింది టాక్. ఇలా అన్ని రకాలుగా ఆ ఫ్యామిలీ నుంచి సంబంధాలు తెంచుకుంది సమంత.
కానీ చైతుకి సంబంధించిన టాటూ మాత్రం ఇంకా క్యారీ చేస్తోంది. సమంత ఒంటిపై 'చై' అనే పేరుని ఇంగ్లీష్ అక్షరాలుతో టాటూ వేయించుకుంది. ఈ టాటూని చాలా కాలం పాటు ఎవరికీ చూపించలేదు. 'ఓ బేబీ' సినిమా సక్సెస్ తరువాత ఈ టాటూని బయటపెడుతూ.. 'నా భర్త చై నా ప్రపంచం' అంటూ అప్పట్లో టాటూతో ఉన్న స్టిల్ ను రిలీజ్ చేసింది.
చైతుతో విడాకులు తీసుకున్న తరువాత ఈ టాటూని సమంత చెరిపేసుకుందని అందరూ అనుకున్నారు. సర్జరీ చేయించుకొని మరీ ఈ టాటూ తీయించుకుందంటూ ఆ మధ్య కథనాలు కూడా ప్రచురించారు. కానీ ఇప్పటికీ సమంత ఆ టాటూని తీయించుకోలేదు. తాజా ఫొటోషూట్ లో మరోసారి ఈ టాటూ హైలైట్ అయింది. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ తో డీల్ కుదుర్చుకున్న సమంత.. డీల్ లో భాగంగా హాట్ ఫొటోషూట్ లో పాల్గొంది. అందులో సమంత పక్కటెముకపై ఉన్న చై టాటూ బయటపడింది. చైతుతో అన్ని విధాలుగా తెగదెంపులు చేసుకున్న సమంత.. ఈ టాటూని మాత్రం ఎందుకు ఇంకా కొనసాగిస్తుందో ఆమెకే తెలియాలి!
Also Read: రోలెక్స్ సర్ కి రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ - రేటెంతో తెలుసా?
Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion