Shaakuntalam New Release date : ఏప్రిల్‌లో సమంత 'శాకుంతలం' - విడుదల ఎప్పుడంటే?
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కావాలి. అయితే... వాయిదా వేశారు. ఈ రోజు న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. అయితే, ఆల్రెడీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.
రెండుసార్లు వాయిదా!
తొలుత గత ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదల చేయాలని గుణ టీమ్ వర్క్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ప్లాన్ చేశాయి. అయితే, ఎందుకో ఆ తేదీకి రావడం కుదరలేదు. ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం మళ్ళీ వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 14న 'శాకుంతలం'
'శాకుంతలం' సినిమా కొత్త విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు. ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మరో రెండు సినిమాలు ఉన్నాయి. 'అల్లరి' నరేష్ 'ఉగ్రం', రాఘవా లారెన్స్ 'రుద్రుడు' రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'ను తొలుత ఏప్రిల్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఇప్పుడు వాయిదా వేశారట.
Also Read : 'ఫర్జీ' రివ్యూ : 'ఫ్యామిలీ మ్యాన్' రేంజ్ ఉందా? విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌ల వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
View this post on Instagram
పాటలకు మంచి స్పందన
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'మల్లికా.... మల్లిక', 'ఏలేలో ఏలేలో...', 'ఋషి వనములోన...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : 'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'శాకుంతలం' ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సమంత లాస్ట్ సినిమా 'యశోద' రైట్స్ కూడా ప్రైమ్ దగ్గర ఉన్నాయి. ఒక్క యశోద మాత్రమే కాదు... సమంత సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. అంతకు ముందు 'అత్తారింటికి దారేది', 'మజిలీ', 'జాను', 'రంగస్థలం', 'యూ టర్న్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... సమంత సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ప్రైమ్ వీడియోలో ఉన్నాయి.
'శాకుంతలం' ట్రైలర్ విడుదలైన తర్వాత నెగిటివిటీ ఎక్కువ వచ్చింది. సీరియల్ గ్రాఫిక్స్ చేసినట్టు చేశారని, సినిమాలా లేదని కామెంట్స్ వచ్చాయి. అయినా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందంటే సమంత స్టార్‌డమ్‌కు ఇదొక ఉదాహరణ. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఆదరణ ఉండటంతో ఓటీటీ హక్కులకు మంచి రేటు వచ్చింది.
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం.