అన్వేషించండి

Samantha: అమెరికాలో సమంతకు చేదు అనుభవం, ఇంతకీ ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందంటే?

అమెరికా పర్యటనలో ఉన్న సమంతకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమెను నిర్వాహకులు ఆమెకు చిరాకు కలిగించారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అందాల తార సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. మైయోసిటిస్ కు చికిత్స కోసం ఆమె గత కొంత కాలంగా అక్కడే ఉంటుంది. ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. ఆగష్టు 15 సందర్భంగా ఇండియా డే పరేడ్ లో పాల్గొని సందడి చేసింది. రీసెంట్ గా డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ కు హాజరైంది. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి కాసేపు సందడి చేసింది. అభిమానులను కలిసి వారితో ఫోటోలు దిగింది. అయితే, తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఈవెంట్ లో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ఆమెకు చిరాకు కలిగించడంతో అనుకున్న సమయానికి కంటే ముందుగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందట.   

అమెరికాలో సమంతకు చేదు అనుభవం

ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సమంత ముందుగానే ఫేమెంట్ తో పాటు టైమ్ ఫిక్స్ చేసుకుందట. రెండు గంటల పాటు ఈవెంట్ లో ఉంటానని చెప్పిందట. ఇందుకు గాను $25,000 పేమెంట్ ఇవ్వాలని కోరిందట. నిర్వాహకులు అందుకు సరే అన్నారు. అనుకున్నట్లుగానే ఈ ఈవెంట్ కు హాజరైన సమంత గంటన్నర తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, ఆమె కారులో బయల్దేరుతుండగా నిర్వాహకులు మరో ట్విస్ట్ ఇచ్చారు.  సమంత కారు వెనుకాలే వెళ్తున్న లగేజీ కారును ఆపారు. సుమారు గంట పాటు బయటకు వెళ్లనీయలేదట. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

సమంత పట్ల తీవ్ర పదజాలాన్ని ఉపయోగించిన ఈవెంట్ నిర్వాహకుడు

అటు సమంత కోపంతో వెళ్లిపోతున్న సమయంలో ఈవెంట్ నిర్వాహకుడు ఆమె కారు నడుపుతున్న వ్యక్తికి కాల్ చేశాడట. ఆయన తీవ్ర పదజాలంతో సమంతపై కోప్పడ్డట్లు తెలుస్తోంది. యాక్టివ్ బ్లూటూత్ కనెక్షన్ కారణంగా, అతడు మాట్లాడిన మాటలు కారు స్పీకర్ సిస్టమ్ ద్వారా బయటకు వినిపించాయట. ఆయన మాట్లాడిన మాటలు సమంతకు  ఇబ్బంది కలిగించాయట. ఆర్గనైజర్ అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడ్డంతో తీవ్రంగా బాధపడిందట. ఈ సంఘటన తనను చాలా బాధించబడినప్పటికీ,  ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకుందట. అయితే, నిర్వాహకులపై ఆమెకు ఎందుకు కోపం వచ్చింది? ఆమె ముందుగానే ఈవెంట్ నుంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

ఇక సమంత తాజాగా ‘ఖుషి‘ సినిమాలో కనిపించింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి ఈ సినిమాలో నటించింది.  సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా హిట్ పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.    

Read Also: జపాన్‌ వెకేషన్‌లో రవితేజ, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 26thజగధాత్రిని అక్కా అంటూ కౌగిలించుకున్న నిషిక...అక్కా చెల్లెల్ల మధ్య ప్రేమకు కారణమేంటి..?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిని అక్కా అంటూ కౌగిలించుకున్న నిషిక...అక్కా చెల్లెల్ల మధ్య ప్రేమకు కారణమేంటి..?
Khushbu Sundar Daughter Wedding: ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
Isakapatnam Trailer : ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Embed widget