అన్వేషించండి

Samantha: రెండో పెళ్లిపై స్పందించిన సమంత - ఏమని చెప్పారు?

Samantha Second Marriage: సమంత సోషల్ మీడియాలో రెండో పెళ్లిపై స్పందించారు.

Samantha Instagram: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ముందంజలో ఉంటారు. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ... సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక క్యూ అండ్ ఏ సెషన్‌తో సమంతకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఎదురైంది.

రెండో పెళ్లి చేసుకోరా...
‘మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా?’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శామ్ ఆన్సర్ ఇస్తూ ‘గణాంకాల ప్రకారం అది మంచి పెట్టుబడి కాదు.’ అని ఫన్నీగా చెప్పారు. దాని పక్కన లాఫ్ ఎమోజీ కూడా యాడ్ చేశారు. దాని కింద ఒక రీసెర్చ్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. దీని ప్రకారం 2023 నాటికి మొదటిసారి వివాహం చేసుకునే వారిలో విడాకుల రేటు ఏకంగా 50 శాతం వరకు ఉందట. రెండో పెళ్లి చేసుకునే వారిలో అది 67 శాతంగానూ, మూడో పెళ్లి చేసుకునే వారిలో 73 శాతంగానూ ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే సమంత ఇప్పుడు ఆ స్టోరీని డిలీట్ చేశారు.

సమంత ఇటీవలే సినిమాల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా మూవీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ లక్ష్యం. అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే వేదికగా ఇది నిలవనుంది.’ అని ఈ సందర్బంగా  పోస్టులో పేర్కొన్నారు. 

అలాగే తన నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తన చిన్నప్పుడు ఇష్టంగా విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు సమంత తెలిపారు.

సోషల్ మీడియా వేదికల్లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న భారతీయ సినీ సెలబ్రిటీల్లో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంటారు. దక్షిణాదితో పాటు ఉత్తరాది‌లోనూ భారీ క్రేజ్ సమంత సొంతం. ఇటీవలే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య 31 మిలియన్లను దాటేసింది. 30 మిలియన్ల మైలురాయిని దాటినప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనందాన్ని వ్యక్తపరిచారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా దేశవ్యాప్తంగా సమంత మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

టాప్ హెడ్ లైన్స్

Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget