Salman Khan: 'నాకు కాదు, నా గర్ల్ఫ్రెండ్స్కు పెళ్లిలు అయిపోయాయ్' యాడ్లో తనపై తానే పంచ్ వేసుకున్న సల్మాన్
కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ లులియా వంతూర్ ని డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
సల్మాన్ ఖాన్ కొన్నాళ్లుగా పెప్సీ సాఫ్ట్ డ్రింక్ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దీనికి సంబంధించిన యాడ్ లో నటించారు సల్మాన్ ఖాన్. ఈ యాడ్ లో ఇద్దరు సల్మాన్ ఖాన్ లు కనిపించారు. ఒకరు గతానికి చెందిన సల్మాన్ కాగా.. మరొకరు ఫ్యూచర్ కి చెందిన సల్మాన్. ఈ యాడ్ లో సల్మాన్ ఖాన్ నేరుగా.. 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమా టైంలో ప్రేమ్(సల్మాన్ ఖాన్) ను కలవడానికి వెళ్తారు.
తన ఫ్యూచర్ వెర్షన్ ని చూసి షాక్ అవుతాడు ప్రేమ్. దీంతో అతడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. 'ఫ్యూచర్ లో నా బాడీ..?' అని ప్రేమ్ అడగ్గా.. 'సేమ్' అని చెప్తాడు సల్మాన్. 'అభిమానుల ప్రేమ..?' అనే మరో ప్రశ్నకు మళ్లీ 'సేమ్' అని చెబుతాడు సల్మాన్. 'మరి పెళ్లి..?' అని ప్రేమ అడగ్గా.. 'అయిపోయింది.. నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ' అని బదులిస్తాడు సల్మాన్. ఈ యాడ్ లో తన లవ్, మ్యారేజ్ లైఫ్ పై తనపై తనే పంచ్ వేసుకున్నాడు సల్మాన్.
ప్రస్తుతం ఈ యాడ్ బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ లులియా వంతూర్ ని డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'టైగర్ 3' సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
View this post on Instagram
View this post on Instagram