అన్వేషించండి

Salman Khan: సల్మాన్ అభిమానులకు గుడ్ న్యూస్ - ‘కిక్ 2’ నుంచి బిగ్ అప్డేడ్ వచ్చేసింది!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి ఓ వార్త వచ్చింది. దీంతో ‘కిక్ 2’ మూవీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది..

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటింది. ఈ మూవీని సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వం వహించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. దీనిపై గతంలో కూడా సల్మాన్ ఖాన్ ఓ ప్రకటన చేశారు. అయితే తాజాగా ‘కిక్ 2’ మూవీకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ను అనౌన్స్ చేశాడు దర్శకుడు సాజిద్. దీంతో సల్మాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటోన్న ‘కిక్ 2’..

సల్మాన్ ఖాన్ ‘కిక్ 2’ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ దర్శకుడు సాజిద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కిక్ 2’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘కిక్ 2’ సినిమా కచ్చితంగా ఉంటుందని అన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని, అయితే దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పాడు. సల్మాన్ ఖాన్ కూడా స్క్రిప్ట్ ను చదివారని చెప్పాడు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

సాజిద్ 2014లో ‘కిక్’ తో సాజిద్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అప్పట్లో ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్ల వసూళ్లను సాధించింది. అంతే కాకుండా ఈ మూవీతోనే నవాజుద్దీన్ సిద్దిఖీ, రణదీప్ హుడా వంటి నటులు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ విలన్‌ గా నటించగా, రణదీప్ పోలీస్ పాత్రలో నటించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా కనిపించింది. 

‘కిక్ 2’ కోసం సమయం కావాలి: సాజిద్

సల్మాన్ అవైటెడ్ సినిమాల్లో ఈ ‘కిక్ 2’ ఒకటి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీపై దర్శకుడు సాజిద్ ఆచుతూచి అడుగులు వేస్తున్నాడు. అన్నీ కుదిరినపుడే సినిమాను సెట్స్ పైకి తీసుకు వస్తామని ఇదే విషయం సల్మాన్ కు కూడా తెలుసన్నారు. ప్రస్తుతం సినిమా పేపర్ వర్క్ జరుగుతోందని  అన్నాడు. మూవీను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చూస్తున్నామని, అందుకు తగిన సమయం కూడా కావాలని  అప్పుడే ‘కిక్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నాడు. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మరి మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి. 

ఇక సల్మాన్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇటీవల ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో కనిపించారు. ఇందులో పూజా హెగ్డే, వెంకటేష్, జస్సీ గిల్, జగపతి బాబు, రాఘవ్ జుయల్, భూమికా చావ్లా, భాగ్యశ్రీ, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివార్, విజేందర్ సింగ్ తదితరులు నటించారు. రామ్ చరణ్, అబ్దు రోజిక్ ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. సల్మాన్ తదుపరి ‘టైగర్ 3’ లో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ స్పై పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: కన్నీళ్లు పెట్టించేశారు - విజయ్ దేవరకొండ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Psychological Thriller OTT : ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు
Happy Journey OTT : రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రీసెంట్ కామెడీ ఎమోషనల్ డ్రామా - 'హ్యాపీ జర్నీ' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రీసెంట్ కామెడీ ఎమోషనల్ డ్రామా - 'హ్యాపీ జర్నీ' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Godavari Serial Today November 13th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
DNK Movie OTT : ఓటీటీలోకి మౌళి DNK - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మౌళి DNK - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Embed widget