అన్వేషించండి

Dhamaka Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న ధమాకా - మొదటిరోజు కలెక్షన్ల కంటే మూడో రోజు ఎక్కువ!

రవితేజ ధమాకా సినిమా మొదటి వీకెండ్‌లో అద్భుతమైన కలెక్షన్లు సొంతం చేసుకుంది.

ధమాకా సినిమాతో రవితేజ మాస్ హిట్ కొట్టేశాడు. సినిమాకు రివ్యూయర్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వింటేజ్ రవితేజ మార్కు కనిపించిందని మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో మాస్ మహరాజ్ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ‘ఖిలాడీ’, ‘రామారవు ఆన్ డ్యూటీ’ డిజాస్టర్ల నుంచి తేరుకుని 2022ని బ్లాక్ బస్టర్‌తో ముగించాడు. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్లు మొదటి రోజు కంటే ఎక్కువ ఉందని ట్రేడ్ వర్గాల టాక్.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా రూ.4.66 కోట్లను వసూలు చేసింది. క్రాక్ తర్వాత రవితేజకు ఈ స్థాయి ఓపెనింగ్స్ మళ్లీ ధమాకాతోనే వచ్చాయి. ఇక రెండో రోజు కూడా రూ.3.53 కోట్లను వసూళ్లు చేసి మంచి హోల్డ్ చేసింది. ఇక మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతరను మరిపించేలా మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.ఐదు కోట్ల వరకు వసూళ్లు మూడో రోజు వచ్చాయన్న మాట. 

దీంతో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా మొదటి వీకెండ్‌లో రూ.13 కోట్ల వరకు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా హక్కులను రూ.16 కోట్లకు విక్రయించారు. వీటిలో రూ.13 కోట్లు మొదటి వీకెండ్‌లోనే వచ్చాయి. సంక్రాంతి వరకు ధమాకాకు పోటీగా సరైన సినిమా లేదు. కాబట్టి చాలా కాలం తర్వాత రవితేజ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించనుంది.

ఇక సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.18.3 కోట్లుగా ఉంది. మొదటి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.10 కోట్లు వరకు వసూలు చేసింది. మూడో రోజు రూ.ఆరు కోట్లు వచ్చి ఉంటాయని అంచనా. అంటే మరో రూ.2.3 కోట్లు చేస్తే బ్రేక్ ఈవెన్ మార్కును ధమాకా దాటనుంది.

ఈ ఏడాది రవితేజ మూడు సినిమాలు విడుదల చేశారు. వచ్చే ఏడాది కూడా ఆయన నుంచి మూడు సినిమాలు రావడం కచ్చితంగా కనబడుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీనికి ‘ఈగిల్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' కూడా విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by People Media Factory (@peoplemediafactory)

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Priyadarshi Idupukayitham : తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాయితం - హీరోగా ప్రియదర్శి... హీరోయిన్‌గా ఫేమస్ ఫోక్ సింగర్
తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాయితం - హీరోగా ప్రియదర్శి... హీరోయిన్‌గా ఫేమస్ ఫోక్ సింగర్
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget