అన్వేషించండి

Rathika: తూటాల్లాంటి ప్రశ్నలతో రతికకి చెమటలు పట్టించిన గలాటా గీతూ

బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినెట్ అయిన తర్వాత రతిక బిగ్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది.

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఇంటి నుంచి రతిక బయటకి వచ్చేసింది. తను బయటకి వచ్చేటప్పుడు ఎవరూ అంతగా ఎమోషనల్ అవలేదు. మొదటి వారంలో సీనియర్ నటి కిరణ్ రాథోడ్ హౌజ్ ని విడిచి వెళ్ళగా.. రెండో వారంలో మరో సీనియర్ నటి షకీలా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కానీ రతిక వెళ్తే మాత్రం హమ్మయ్య పీడా విరగడ అయిందిలే అనుకున్నట్టుగా పట్టించుకోకుండ ఉన్నారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత రతిక బిగ్ బజ్ ఇంటర్యూలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అందులో యాంకర్ గా వచ్చిన గలాటా గీతూ రతిక దిమ్మదిరిగే ప్రశ్నలు వేసి నోట్లో నుంచి మాట రాకుండా చేసేసింది.

బిగ్ బాస్ హౌస్ లో అందరినీ వాడుకుని ఆడుకోవాలని చూసిందీ రోజా కానీ చివరికి వాడిపోయిందని రతిక గురించి దారుణంగా ఇంట్రడ్యూస్ ఇచ్చింది. బాహుబలి సినిమాలో వెన్నుపోటు పొడిచిన కట్టప్పని రతిక క్రాస్ చేసినట్టుగా అనిపించిందని తూటాల్లాంటి ప్రశ్నలు వేసింది. ఎవరిని వెన్ను పోటు పొడిచానని రతిక ఎదురు ప్రశ్నించింది. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, ప్రశాంత్ విషయంలో మొదట చెయ్యి అందించించి నువ్వే కదా అంటే ఏమి తెలియనట్టు “నేనా” అని రతిక అనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే రతిక మొదట ప్రశాంత్ కి ఫేవర్ గా మాట్లాడి రెండో వారానికి అతడితో గొడవకి దిగింది. హౌస్ లోనే కాదు ఇక్కడ కూడ మానిప్యులేట్ చేస్తున్నట్టు ఉందని గీతూ గాలి తీసేసింది. ఎక్స్ అనే ఎమోషన్ ని బాగా వాడుకున్నట్టు అనిపించింది, మీకు బాగా వాడుకోవడం అలవాటు కదా అని ఇన్ డైరెక్ట్ గా రాహుల్ మ్యాటర్ కూడా గీతూ టచ్ చేసినట్టు అనిపించింది.

వాడుకునే అలవాటు ఉంటే వాడుకునే టైమ్ వచ్చినప్పుడు వాడుకునే దాన్ని అని రతిక చెప్పిన సమాధానం అంతగా ఆకట్టుకోలేదు. అనాల్సినవన్నీ అనేసి చివర్లో మర్చిపోయాను అనడం స్ట్రాటజీనా అని ప్రశ్నించింది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటారు. కానీ ప్రశాంత్ ని తమ్ముడు అంటూనే తనతో పేకాట ఆడుకున్నావ్ కదా అంటూ గీతూ వేసిన ప్రశ్నలకి రతికకి చెమటలు పట్టాయి. ప్రశాంత్ క్రయింగ్ స్టార్ అయితే నువ్వు కన్నింగ్ స్టార్ అని గీతూ అనడం హైలెట్ గా నిలిచింది.

Also Read: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత వరకు రతిక.. ఎక్కువగా పల్లవి ప్రశాంత్, శివాజీలతోనే క్లోజ్‌గా ఉండేది. కానీ ఓవారం నామినేషన్స్ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను దూరం పెట్టింది. తాజాగా యావర్‌తో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌పై కామెంట్స్ చేశాడని శివాజీని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది రతిక. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అంతా శివాజీకి సపోర్ట్ చేసినా తను మాత్రం అసలు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రతిక విషయంలో శివాజీ చాలా హర్ట్ అయ్యారు. ఒకప్పుడు తనను బిడ్డ, బిడ్డ అని ప్రేమగా పిలిచాను. ఎవరైనా తనను ఏమైనా అంటున్నా కూడా పోనీలే చిన్నపిల్ల అని సపోర్ట్ చేశాను అని రతిక బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోతున్నప్పుడు గుర్తుచేసుకున్నారు శివాజీ. ఇక ప్రశాంత్ కూడా కనీసం రతికను పలకరించడానికి దగ్గరకు కూడా వెళ్లలేదు.

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget