అన్వేషించండి

Ram Gopal Varma: 'ఆర్జీవీకి అమ్మాయిల పిచ్చి' ఆయన సోదరి ఏమందో తెలుసా?

వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ చిన్నతనంలో ఎలా ఉండేవారో ఆయన సోదరి విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.

రామ్ గోపాల్ వర్మ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఏ విషయంపైనైనా.. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ చిన్నతనంలో ఎలా ఉండేవారో ఆయన సోదరి విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. తొలిసారి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారామె. ఈ క్రమంలో వర్మ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

చిన్నతనంలో వర్మ తన సోదరి విజయలక్ష్మికి ఓ రేడియో కొనిపెట్టారట. ఒకరోజు అది కిందపడి మిగిలిపోతే.. విజయలక్ష్మి ఏడుస్తూ కూర్చున్నారట. అప్పుడు వర్మ అక్కడకి వచ్చి 'రేడియో మిగిలిపోతే రిపేరు చేయాలి.. ఏడిస్తే అతుక్కోదు' అని అన్నారట. అప్పుడే వర్మ ఆలోచన విధానం చాలా ప్రాక్టికల్ గా ఉండేదని.. విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. వర్మకి సెంటిమెంట్లు ఉండవని అంటుంటారు కానీ.. తన తల్లి, చెల్లెలు ఏడిస్తే అసలు తట్టుకోలేకపోయేవారట. తండ్రి చనిపోయినప్పుడు కూడా వాళ్లు ఎమోషనల్ అవ్వకుండా చూసుకున్నారట. 

'ఏడిస్తే బాధ పోదు.. దానికి సొల్యూషన్ వెతకాలనేది వర్మ సిద్ధాంతమని' అతడి చెల్లెలు విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. వర్మకి అమ్మాయిల పిచ్చి అనే కామెంట్స్ పై కూడా ఆమె మాట్లాడారు. 'వర్మ అమ్మాయిలకు కాంప్లిమెంట్స్ ఇస్తాడేగానీ .. వాళ్లతో అసభ్యంగా  ప్రవర్తించడని.. ఒకవేళ అలా ప్రవర్తించి ఉంటే.. ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయైనా వర్మకి వ్యతిరేకంగా మాట్లాడేది. అలా జరగలేదంటే.. తను వాళ్లతో ఎంత హుందాగా ఉండేవాడో అర్ధం చేసుకోవచ్చు' అంటూ చెప్పుకొచ్చారు. 

వర్మకి శ్రీదేవి, జయసుధ అంటే చాలా ఇష్టమని.. జయసుధ దగ్గరకు వెళ్లి 'మీ తరువాతే శ్రీదేవి' అనేవాడు.. శ్రీదేవి దగ్గరకు వెళ్లి 'మీ తరువాతే ఎవరైనా' అనేవాడని.. వాళ్లకు కూడా ఈ విషయం తెలుసని నవ్వేశారు విజయలక్ష్మి. అలానే చిన్నప్పటి ఓ సంఘటనను షేర్ చేసుకున్నారు. 

'మా చిన్నతనంలో తరచూ ఓ అమ్మాయి ఇంటికి వచ్చేది. ఆ అమ్మాయికి మీ కళ్లు చాలా బాగున్నాయండి అని వర్మ చెప్పాడు. మేమంతా షాకయ్యాం. ఆ అమ్మాయితో అప్పటివరకు ఎవరూ అలా మాట్లాడలేదు. పైగా ఆమెది మెల్లకన్ను. దీంతో మా అన్నయ్యని ఎందుకలా అన్నావ్.. తనకు మెల్లకన్ను కదా..? అని ప్రశ్నిస్తే.. 'నేను మాత్రం చూశానేంటి..? తను హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పాను అంటూ బదులిచ్చాడు. ఓసారి బ్యాంక్ లో క్యాషియర్ ను చూసి 'మీ నవ్వు బాగుందండి' అని చెప్పాడు. వర్మకి కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇష్టం' అంటూ చెప్పుకొచ్చారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget