Ram Charan: సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ క్యామియో - నిజమేనా?
సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రోల్ పోషించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

మెగాస్టార్ ఫ్యామిలీకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఉన్న రిలేషన్ గురించి తెలిసిందే. సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు. ఆయన ఇక్కడకి వచ్చిన ప్రతిసారి చిరంజీవి ఇంటి నుంచే అతడికి లంచ్ బాక్స్ వెళ్తుంటుంది. అలానే చిరు, చరణ్ ముంబై వెళ్లారంటే.. సల్మాన్ ని కలుస్తుంటారు. చాలా ఏళ్లుగా వీరి మధ్య బంధం కొనసాగుతోంది. చిరుపై ఉన్న అభిమానంతోనే ఆయన నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో క్యామియో రోల్ పోషించడానికి అంగీకరించారు సల్మాన్.
సినిమాలో చిరు, సల్మాన్ లపై ఓ పాటను కూడా ఉంటుంది. ఇటీవలే దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. సల్మాన్ లాంటి హీరో తెలుగు సినిమాలో క్యామియో రోల్ చేస్తున్నారంటే విశేషమే. చిరుపై ఉన్న అభిమానంతోనే సల్మాన్ ఈ సినిమా చేశారని.. రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సల్మాన్ నటిస్తోన్న ఓ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రోల్ లో కనిపించనున్నారట.
బాలీవుడ్ మీడియా ఈ వార్తలను ప్రచురిస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమాలో చరణ్ కనిపించనున్నాడట. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు చరణ్ కూడా యాడ్ అవ్వడంతో సౌత్ లో ఈ సినిమాకి క్రేజ్ పెరగడం ఖాయమనిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో నార్త్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు చరణ్. సల్మాన్ సినిమాలో ఆయన క్యామియో చేస్తే ఆ సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నారు మేకర్స్.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















