Rajasekhar Monster Update : ఇది RRR కాదు, డబుల్ 'ఆర్' - రాజశేఖర్, పవన్ సినిమాలో యంగ్ హీరో!
రాజశేఖర్ కొత్త సినిమాలో యంగ్ హీరో కూడా ఉన్నారు. ఆ హీరో పేరు కూడా 'ఆర్'తో స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఆయనది చాలా ఇంపార్టెన్స్, స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ అని తెలిసింది.
![Rajasekhar Monster Update : ఇది RRR కాదు, డబుల్ 'ఆర్' - రాజశేఖర్, పవన్ సినిమాలో యంగ్ హీరో! Rajasekhar Monster Update Young Hero Joins Rajasekhar Pavan Sadineni's Monster Cast Check More Details Rajasekhar Monster Update : ఇది RRR కాదు, డబుల్ 'ఆర్' - రాజశేఖర్, పవన్ సినిమాలో యంగ్ హీరో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/14/9d3b7d939dc540f3087287059267e0861665739515994313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కథానాయకుడిగా యువ దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni) తెరకెక్కిస్తున్న సినిమా 'మాన్‌స్టర్' (Monster Telugu Movie). ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆగస్టులో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... సినిమాలో రాజశేఖర్‌తో పాటు మరో హీరో కూడా ఉన్నారు!
డబుల్ 'ఆర్' అనొచ్చు!
కథానాయకుడిగా రాజశేఖర్‌కు 92వ సినిమా ఇది. అందుకని, RS 92 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాను డబుల్ 'ఆర్' అని కూడా అనొచ్చు. ఎందుకంటే... 'మాన్‌స్టర్'లో నటించనున్న మరో సినిమా ఎవరో కాదు, రాజ్ తరుణ్ (Raj Tarun In Monster Movie). ఆయన పేరు, యాంగ్రీ స్టార్ పేరు 'ఆర్'తో స్టార్ట్ అవుతాయి కదా! అందుకని, డబుల్ 'ఆర్' అన్నమాట!
View this post on Instagram
రాజ్ తరుణ్ పాత్ర ఏమిటి?
Raj Tarun Role In Rajasekhar's Monster Movie : 'మాన్‌స్టర్'ను యాక్షన్ ఎంటర్‌టైనర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే... సినిమాలో ఆయన రోల్‌కు చాలా ఇంపార్టెన్స్, స్క్రీన్ స్పేస్ ఉందని తెలిసింది. త్వరలో ఆయన షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ మధ్య పోరాటం నేపథ్యంలో సినిమా రూపొందుతోంది.
యాంగ్రీ స్టార్ అంటే పోలీస్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. మరి, 'మాన్‌స్టర్'లో ఆయన పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారా? గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారా? రాజశేఖర్, రాజ్ తరుణ్... ఇద్దరిలో ఒకరు పోలీస్ అయితే? మరొకరు గ్యాంగ్ స్టర్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
కుమార్తెతో వెబ్ సిరీస్...
తండ్రితో సినిమా!
రాజశేఖర్ ఫ్యామిలీలోని నటీనటులతో రాజ్ తరుణ్‌కు రెండో ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీతో ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం ఆ షో రూపొందుతోంది. వెబ్ సిరీస్ విడుదలకు ముందే రాజశేఖర్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు.
Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?
సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై 'మాన్‌స్టర్' సినిమను మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 'రన్ రాజా రన్' ద్వారా తెలుగులో ఆయన పాపులర్ అయ్యారు. ఆయన సంగీతం అందించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదం అయ్యాయి. ఆ తర్వాత ప్రభాస్ 'సాహో' సహా కొన్ని తెలుగు సినిమాలకూ సంగీతం అందించారు. ఇప్పుడు రాజశేఖర్ సినిమాకు పని చేస్తున్నారు.
ఈ చిత్తానికి వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి మాటలు రాస్తున్నారు. హుస్సేన్ షా కిరణ్, వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ''నేను 'సేనాపతి' సినిమాతో యాక్షన్ ఫ్లేవర్ రుచి చూశా. నాకు అది నచ్చింది. ఇప్పుడు యాక్షన్ మీద నాకు మరింత ప్రేమ పెరిగింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌తో నేను చేయబోయే సినిమా యాక్షన్ ప్రేమికులకు పండగ'' అని సినిమా పూజా కార్యక్రమాల రోజున పవన్ సాధినేని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)