Mahesh Babu : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్షనల్ - మహేష్ బాబు రియల్
సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ అయితే... రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రియల్! అవును... ఇది నిజం! రాజమౌళి - మహేష్ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇది!
![Mahesh Babu : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్షనల్ - మహేష్ బాబు రియల్ Rajamouli creates fictional characters for Prabhas NTR Ram Charan but Mahesh Babu he selects real life incidents SSMB 29 Update Mahesh Babu : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్షనల్ - మహేష్ బాబు రియల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/e27f3f28f1f7131f00aae7972b257ce11666071362383313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా! ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్' - ఈ డైలాగ్ గుర్తు ఉందా? 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంలో నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగ్! ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ డైలాగును కొంచెం మార్చి తమ హీరో కొత్త సినిమా గురించి గొప్పగా చెప్పొచ్చు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఓ సినిమా (SSMB 29) ప్లానింగ్‌లో ఉంది. ఇది తెలిసిన విషయమే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక... నెక్స్ట్ ఇయర్ రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదీ తెలిసిన విషయమే. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫిక్షనల్...
మహేష్ బాబు సినిమా రియల్ ఇన్సిడెంట్స్!
మహేష్ బాబు సినిమా కంటే ముందు పాన్ ఇండియా చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' తీశారు రాజమౌళి. ఆ రెండూ ఫిక్షనల్ కథలు. వాటి కంటే ముందు తీసిన 'ఈగ', 'మర్యాద రామన్న', 'మగధీర', 'యమదొంగ' చిత్రాలూ ఫిక్షనల్ కథలతో తీశారు. ఆయా సినిమాల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఫిక్షనల్ కథల్లో లార్జర్ దేన్ లైఫ్ హీరోలుగా చూపించారు.
ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు మాత్రం రాజమౌళి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. రియల్ లైఫ్ హీరోగా, లార్జర్ దేన్ లైఫ్ టైపు క్యారెక్టర్‌లో సూపర్ స్టార్‌ను చూపించబోతున్నారట. 'విక్రమార్కుడు'లో రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తర్వాత, మళ్ళీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ / క్యారెక్టర్ బేస్ చేసుకుని రాజమౌళి తీస్తున్న సినిమా ఇదేనేమో!?
Also Read : ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ - రేపటి నుంచి అసలు కథ మొదలు
SSMB 29 Movie Update : అఫిక్రన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మహేష్ రాజమౌళి సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళతారు కాబట్టి... నెమ్మదిగా వివరాలు వెల్లడించనున్నారు.
మహేష్ జోడీగా దీపిక?
మహేష్ బాబు - రాజమౌళి సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అయితే, అప్పుడే ఇందులో హీరోయిన్ ఎవరు? అనే డిస్కషన్ కూడా మొదలైంది. దీపికా పదుకొనే (Deepika Padukone to act with Mahesh Babu In Rajamouli Film?) పేరు ముంబై సర్కిల్స్‌లో వినబడుతోంది. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో ఆమె నటిస్తున్నారు. కొన్ని హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. రాజమౌళి అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తారు కాబట్టి సినిమా చేయడానికి ఆవిడ ఆసక్తి చూపించవచ్చు. హిందీ ప్రేక్షకులు, ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు దీపికా పదుకొనే బాగా తెలుసు కాబట్టి... ఆవిడ ఇమేజ్, స్టార్ స్టేటస్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)