Samantha: ఆ రోజు ఎంతో దూరంలో లేదు... త్వరలో సమంత లుక్... అప్‌డేట్ ఇచ్చిన 'శాకుంతలం' నిర్మాత!
సమంత ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారు? ఎన్ని భాషల్లో విడుదల చేస్తారు? నిర్మాత అప్‌డేట్స్ ఇచ్చారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం' (Shakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి, సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు? ఎన్ని భాషల్లో విడుదల చేస్తారు? శకుంతలగా సమంత లుక్ (Samantha First Look from Shakuntalam) ఎప్పుడు విడుదల చేస్తారు? ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడు? ముందు లుక్ రిలీజ్ చేస్తారా? సాంగ్ రిలీజ్ చేస్తారా? ఈ ప్రశ్నలకు నీలిమా గుణ (Neelima Guna Interview - Shakuntalam Movie) ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సినిమా గురించి ఆమె ఏమని బదులిచ్చారో చూడండి.
ఈ ఏడాది ప్రథమార్థంలో 'శాకుంతలం' సినిమాను ఆశించవచ్చా?
అవును... ఎటువంటి సందేహాలు లేకుండా! త్వరలో 'శాకుంతలం' విడుదల అవుతుంది.
'శాకుంతలం' పాటలు ఎప్పుడు విడుదల చేస్తారు? వెయిటింగ్...
ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని మేం వర్క్ చేస్తున్నాం. త్వరలో విడుదల చేస్తాం.
సమంత ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఆ రోజు ఎంతో దూరంలో లేదు!
సమంత గురించి... ఆమెతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి...
బ్యూటిఫుల్, హార్డ్ వర్కింగ్, బ్రిలియంట్ యాక్టర్, కష్టకాలం నుంచి సమంత చాలా త్వరగా కోలుకుంటుంది. సెట్స్‌లో... నటిగా ఆమె పెర్ఫార్మన్స్ చూడటం ఎంతో ప్రత్యేకంగా ఉండేది. సమంత ప్రొఫెషనలిజమ్, కమిట్‌మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి.
దేవ్ మోహన్ గురించి...
దుష్యంతుడి పాత్ర కోసం, తెలుగు డైలాగుల విషయంలో దేవ్ మోహన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన పడిన కష్టానికి మేం థాంక్స్ చెప్పాల్సిందే. అతనితో మళ్లీ పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను.
'శాకుంతలం'లో సమంత లుక్ లేదంటే పాట... ముందు ఏది విడుదల చేస్తారు?
ఫస్ట్ లుక్ (సమంత) ముందు విడుదల అవుతుంది. ఆ తర్వాత మిగతావి విడుదల చేస్తాం. త్వరలో అప్‌డేట్స్ ఇస్తాం. సినిమా థీమ్‌కు తగ్గట్టు ప్రమోషన్ ప్లాన్ చేశాం.
డబ్బింగ్ కంప్లీట్ అయ్యిందా?
జరుగుతోంది.
ఐదు భాషల్లో 'శాకుంతలం' సినిమాను విడుదల చేస్తున్నారా?
అవును. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతుంది.
View this post on Instagram