Prabhas Kriti Sanon : ప్రభాస్, కృతి డేటింగ్ గోల - తప్పంతా ఛానల్‌దేనా?
Varun Dhawan clarifies on Kriti Sanon Prabhas Dating Rumour : ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో పడ్డారని ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చెవులు కొరుక్కునేలా చేసిన వరుణ్ ధావన్, ఎట్టకేలకు స్పందించారు.
ప్రభాస్ (Prabhas) తో ప్రేమ లేదూ... అది పీఆర్ స్టంటూ కాదూ... అని కృతి సనన్ (Kriti Sanon) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. అందరి చూపు కృతి క్లారిఫికేషన్ మీద పడింది. అసలు... ప్రభాస్, కృతి డేటింగ్ రూమర్స్ మొదలు కావడానికి కారణమైన వరుణ్ ధావన్ (Varun Dhawan) కూడా ఆమె క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు.
తెలుగు ప్రేక్షకులు ఎవరూ వరుణ్ ధావన్ లేటెస్ట్ పోస్టును పెద్దగా పట్టించుకోలేదు కానీ... తనది ఏమాత్రం తప్పు లేదన్నట్టు అతడు కామెంట్ చేయడమే విచిత్రం. అసలు ప్రభాస్ మదిలో కృతి సనన్ ఉందని, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది అతను.
''ఇక్కడ నా లిస్టులో కృతి సనన్ పేరు ఎందుకు లేదంటే... ఇప్పుడు కృతి పేరు మరొకరి మనసులో ఉంది. అతను ముంబైలో లేడు. కానీ, ఈ సమయంలో దీపికాతో షూటింగ్ (ప్రాజెక్ట్ కె సినిమా) చేస్తున్నాడు'' అని ఓ టీవీ షోలో అంతా తనకు తెలుసు అన్నట్లు వరుణ్ ధావన్ చెప్పారు. ఆ తర్వాతే ప్రభాస్, కృతి డేటింగ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కృతి సనన్ క్లారిటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వరుణ్ ధావన్ కూడా స్పందించారు.
ఫన్ కోసం ఛానల్ ఎడిటింగ్ చేసిందట!
''అందరికీ హాయ్! మీరు సరదాగా ఎంజాయ్ చేశారు కదా! అయితే, అది ఫన్ మాత్రమే. ఫన్ కోసం ఛానల్స్ అలా ఎడిట్ చేశాయి. మేం దాన్ని సరదాగా తీసుకున్నాం. మీరు ఏదేదో ఊహించుకోవద్దు'' అని వరుణ్ ధావన్ పోస్ట్ చేశారు. ఛానల్స్ ఎడిట్ చేశాయి అంటే అర్థం ఏమిటి? అక్కడ మాట్లాడినది ఒకటి అయితే... ఫన్ కోసం కొంత కట్ చేసి ప్రభాస్‌తో కృతి సనన్ ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు వచ్చేలా ఎడిట్ చేశాయనా? చివరకు తప్పంతా ఛానల్ మీద వరుణ్ ధావన్ నెట్టేశారు!
ప్రేమ లేదు... పీఆర్ కాదు!
వరుణ్ ధావన్ తొలుత చేసిన కామెంట్స్ వల్ల ప్రభాస్, కృతి సనన్ ప్రేమ గురించి మీడియాలో కథలు కథలుగా ఏవేవో రావడం స్టార్ట్ అయ్యాయి. దాంతో కృతి సనన్ స్పందించక తప్పలేదు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ''మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందు నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. ఈ రూమర్స్ అన్నీ నిరాధారమైనవి. ఫేక్ న్యూస్'' అని కృతి పేర్కొన్నారు.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?
మోకాళ్లపై కూర్చుని కృతికి ప్రపోజ్ చేసిన ప్రభాస్!?
కృతి సనన్ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ముందు మోకాళ్లపై కూర్చుని మరీ ఆమెకు ప్రభాస్ ప్రపోజ్ చేశారని ఓ మీడియా సంస్థ రాసుకొచ్చింది. అంతే కాదు... ఇప్పుడు వాళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని, త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారని, వాళ్ళ పెళ్లి మరెంతో దూరంలో లేదని ముంబైలో జనాలు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రచారం జోరుగా సాగుతుండటంతో కృతి సనన్ స్పందించారు.