అన్వేషించండి

Salaar Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘సలార్‘ దూకుడు, రేసులో వెనకబడ్డ ‘డుంకీ‘

Salaar Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సలార్‘ దూసుకెళ్తోంది. తొలి రోజు ఏకంగా రూ. 48.94 కోట్లు వసూళు చేసింది. ‘సలార్‘తో పోల్చితే బుకింగ్స్లో 'డుంకీ' వెనుకబడింది.

Salaar Advance Booking: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో విడుదలైన తాజా చిత్రం ‘సలార్‘. ‘కేజీఎఫ్‘, ‘కేజీఎఫ్2‘ సినిమాల తర్వాత హొంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.   

అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సలార్’ జోరు

‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కొనసాగిస్తోంది. ఓవర్సీస్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. Sacnilk.comలో నివేదిక ప్రకారం, ఈ చిత్రం తొలి రోజు ₹48.94 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. 16,593 షోలకు 22 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కేవలం తెలుగు షోలకే రూ.38.25 కోట్ల విలువైన 17 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. 

హిందీ షో రూ.5.62 కోట్ల విలువైన 2 లక్షలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి. తమిళ షోలకు రూ.1.9 కోట్ల టిక్కెట్లు సినిమా విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌ లో 2 మిలియన్ డాలర్లు అంటే, భారత కరెన్సీలో రూ.16 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు ‘సలార్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

‘సలార్’ వర్సెస్ ‘డుంకీ’ వివాదం

గత కొద్ది రోజులుగా స్క్రీన్స్ విషయంలో ‘సలార్’, ‘డుంకీ’ మధ్య వివాదం కొనసాగుతోంది. నార్త్ ఇండియాలో పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు ‘సలార్’కు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వకుండా, ‘డుంకీ’కి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నార్త్‌లో తమ సినిమాకు తగిన స్క్రీన్స్ ఇవ్వకపోతే, అసలు సౌత్ లో వాళ్లకు తమ సినిమానే ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు. ‘సలార్’ నిర్మాతల డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థతో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించాయి.  అనుకున్న సమయానికే ‘సలార్’ విడుదల అవుతుందని ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలు పెట్టాయి.

‘సలార్’ మూవీ గురించి..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

Read Also: అందుకే రణబీర్, బాబీ కిస్ సీన్ తొలగించాం, అసలు విషయం చెప్పిన సందీప్ వంగా

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 7th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
Nuvvu leka Neanu Lenu Serial Today July 7th:రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
నువ్వులేక నేను లేను: రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
Gundeninda Gudigantalu July 7th Episode: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం
గుండెనిండా గుడిగంటలు: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Embed widget