అన్వేషించండి

Prabhas: ప్రభాస్ యాక్షన్ సీన్‌పై నెట్‌ఫ్లిక్స్ సెటైర్ - ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

'సాహో' సినిమాలో ప్రభాస్ కొండమీద నుంచి లోయలోకి దూకే షాట్ ఒకటి ఉంటుంది. దీనిపై నెట్ ఫ్లిక్స్ వెటకారంగా ఓ పోస్ట్ పెట్టింది. 

సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ ను అవమానించేలా పోస్ట్ లు పెడితే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఇప్పుడు ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థను ఆడేసుకుంటున్నాడు. అసలేం జరిగిందంటే.. 'సాహో' సినిమాలో ప్రభాస్ కొండమీద నుంచి లోయలోకి దూకే షాట్ ఒకటి ఉంటుంది. 

దాన్ని ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్.. 'ఇదేం యాక్షన్..?' అంటూ వెటకారంగా ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా విభాగం. ఇండోనేషియా భాషలోనే ఆ క్యాప్షన్ పెట్టారు. దీన్ని గూగుల్ లో అనువదించి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. 'సాహో' సినిమాను, ప్రభాస్ ను కించపరుస్తున్నట్లుగా ఉండడంతో నెట్ ఫ్లిక్స్ పై యుద్ధం ప్రకటించారు. 

నిన్నటి నుంచి 'అన్‌సబ్‌స్క్రైబ్ నెట్ ఫ్లిక్స్' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్నట్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది నెట్ ఫ్లిక్స్ కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని నెట్ ఫ్లిక్స్ టచ్ చేయకుండా ఉండాల్సింది. బహుశా.. ఇండోనేషియా విభాగానికి ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసి ఉండదు. అందుకే ఇలా వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టి సంస్థపై ఎఫెక్ట్ పడేలా చేసింది. 

'సాహో' సినిమా ప్లాప్ అయినప్పటికీ.. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. యాక్షన్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఉండొచ్చు. ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లో చాలానే ఉంటాయి. అలాంటప్పుడు ప్రభాస్ సినిమాను స్పెషల్ గా టార్గెట్ చేయడం ఎందుకనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరిప్పుడు నెట్ ఫ్లిక్స్ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేస్తుందో చూడాలి!

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'ఆదిపురుష్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ పై మరింత దృష్టి పెట్టడంతో సినిమా రిలీజ్ ఆలస్యమయ్యేలా ఉంది. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇది కాకుండా.. 'సలార్', 'ప్రాజెక్ట్ K' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా మారుతి సినిమాను కూడా మొదలుపెట్టారు. అప్పుడే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today September 24th Episode Promo 2 Written Update In Telugu In Star Maa Jio Hotstar
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఫుడ్ పెట్టి.. వార్నింగ్ మెసేజ్‌లు పంపిన బిగ్‌బాస్! మండిపోతున్న షాలిని, వర్షిని!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటి కాళ్లు నొక్కిన క్రిష్.. అంబికతో మహా గొడవ! విహారికి గోల్డె మెడల్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటి కాళ్లు నొక్కిన క్రిష్.. అంబికతో మహా గొడవ! విహారికి గోల్డె మెడల్!
Paradise KCR Role: కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు
కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు
Crime Thriller Series OTT : భర్తను నరికి డ్రమ్ములో కుక్కిన భార్య - పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాల చిచ్చు... రియల్ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
భర్తను నరికి డ్రమ్ములో కుక్కిన భార్య - పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాల చిచ్చు... రియల్ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
Sai Durgha Tej : ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?
'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?
Hyderabad Tank Bund hit and run case: ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!
ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!
Dancers Association Sumalatha Devi : డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలిపై దాడి - జనరల్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత
డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలిపై దాడి - జనరల్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత
Embed widget