Prabhas on Kriti Sanon : సననా, శెట్టినా? బాలయ్య స్ట్రైట్ క్వశ్చన్స్‌తో ప్రభాస్ దబ్బిడి దిబ్బిడే!
కృతి సనన్‌తో డేటింగ్ రూమర్స్ నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ వరకూ... ప్రభాస్ నుంచి ప్రతి విషయం రాబట్టే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. అసలు,
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాక్ షోలకే బాప్ లా సాగిపోతున్న బాలయ్య మాస్ షోలో బాహుబలి ఆగమనం జరిగింది. అదీ మాములుగా కాదు ఓ రేంజ్ లో...బాలయ్య ప్రభాస్ (Prabahs) కి ఇచ్చిన 'రాజు' ఇండ్రక్షన్ అదిరిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ఎపిసోడ్ ఫుల్ పండగే. అయితే మొత్తం అయిపోలేదు. ఆహా ప్రభాస్ ఎపిసోడ్ లో పార్ట్ 1 స్ట్రీమ్ చేసింది అంతే. అబీ మ్యాటర్ బాకీ హై బాస్ అంటూ అర్థాంతరంగా ముగించింది. సర్వర్ల క్రాష్ గోలను దాటుకుని ఎపిసోడ్ చూసిన సగటు ప్రభాస్ అభిమానికి ఈ ఎపిసోడ్ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో పెండింగ్ అంశంగా మిగిలిపోతున్న ప్రభాస్ పెళ్లి చుట్టూనే తిరిగింది మరి మ్యాటర్ అంతా.
నో డొంక తిరుగుడుస్..
ఓన్లీ స్ట్రైట్ క్వశ్చన్స్!
సననా...? శెట్టా...? ఎలాంటి తడబాటు లేకుండా ప్రభాస్ ను స్ట్రైట్ గా అడిగేశాడు బాలయ్య. సనన్ అంటే కృతి సనన్ (Kriti Sanon)... శెట్టి అంటే అనుష్క శెట్టి (Anushka Shetty) అని కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రభాస్ పెళ్లి టాపిక్ ఈ ఇద్దరు హీరోయిన్ల చుట్టూనే తిరిగింది. ముందు అనుష్క, రీసెంట్ గా కృతి సనన్.
అయితే కృతి సనన్ టాపిక్ ను 'మేడం' క్లారిటీ ఇచ్చేసిందిగా అంటూ గట్టిగానే బదులిచ్చాడు ప్రభాస్. ''మేడం అంటే ఎవరు? పేరు లేదా? పేరు చెప్పవా? సీత పేరు నీ నోటి వెంట రాదా?'' అంటూ బాలయ్య ట్రిగ్గర్ పెట్టి అడిగే సరికి ప్రభాస్ 'కృతి సనన్' సర్ అంటూ చెప్పాల్సి వచ్చింది.
అన్ నెససరీ గోల ఎక్కువైపోయింది : ప్రభాస్!
సోషల్ మీడియా తనను ఆడేసుకుంటోందని ప్రభాస్ అన్నాడు. పోస్టులు కూడా ఉన్నాయి చూపిస్తానంటూ బాలకృష్ణ సోషల్ మీడియా పోస్టులను భారీ డిస్ ప్లే పై చూపించారు. ''పక్కనున్న లక్ష్మణుడిని కట్ చేసి నన్ను ఆ అమ్మాయినే చూపించటం ఏం న్యాయం?'' అంటూ ప్రభాస్ చిరు కోపం ప్రదర్శించాడు. ''మాకు కావల్సిందే మేం తీసుకుంటాం'' అంటూ బాలయ్య చిలిపిగా నవ్వేశారు.
Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్ చేసిన ప్రభాస్
''మీకు తెలియదు సోషల్ మీడియాలో నన్ను ఎలా ఆడుకుంటున్నారో'' అని ప్రభాస్ అనే సరికి... ''మేం ఏడాదికి తొమ్మిది సినిమాలు చేసిన రోజులు ఉన్నాయ''ని బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ''మరి మీ మీద ఎన్ని వచ్చి ఉంటాయో?'' అని ప్రభాస్ బాలయ్య కు బాగానే రివర్స్ పంచ్ ఇచ్చాడు.
రామ్ చరణ్ ఫోన్ కాల్ తో అంతా మారిపోయింది
ముందు అంతా ఎవరూ లేరు...చేసుకుంటాను..టైం రావాలి..అమ్మాయి రాసి పెట్టలేదేమో అంటూ ముక్తసరి సమాధానాలతో ప్రభాస్ తప్పించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే బాలయ్య అడిగారని రామ్ చరణ్ కు ప్రభాస్ ఫోన్ చేశారో సీన్ మొత్తం మారిపోయింది. 'బ్రో కోడ్' ప్రకారం ఏం ఎక్స్ ట్రాలు వాగొద్దని ముందే వార్నింగ్ ఇచ్చేశాడంట ప్రభాస్. అయినా చిరంజీవి తనయుడు చరణ్ లీక్ లు ఇవ్వకుండా ఉంటాడా? ఇచ్చేశాడు! ''త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతున్నాడు సర్'' అదేంటో అడగండి అని బాలయ్యకు తాళం అందించాడు. ఇక అంతే ఫసక్. ప్రభాస్ పని గోవిందా. నిలబెట్టి చెమటలు పట్టించేశాడు బాలకృష్ణ. చెప్తావా లేదా అంటూ బాలయ్య అడగటం... సననా? శెట్టినా? ఓ పేరు చెప్పేయ్ అంటూ దబాయించటం జరిగిపోయాయి. అసలే మొహమాటానికి కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ ఏం చెప్పాలో తెలియక పడిన అవస్థ చూస్తే మాములు ఫన్ కాదు. ''రేయ్ చరణ్ నువ్వు నా స్నేహితుడిగా? శత్రువా?'' అంటూ కోప్పడిన ప్రభాస్... ''చెప్పేది ఏదో మొత్తం చెప్పేయ్! మూడు రోజులు సోషల్ మీడియాలో నన్ను ఆడేసుకుంటారు'' అంటూ టెన్షన్ పడిపోయాడు.
డౌట్ మిగిల్చిన మిర్చి ప్రశ్న!
ఈ పెళ్లి టాపిక్ తో సమాధానం చెప్పటం లేదని సినిమాలు గురించి మాట్లాడుతూనే పెళ్లి క్వశ్చన్ కి ఆన్సర్ లాగే ప్రయత్నం చేశారు బాలయ్య. 'మిర్చి' సినిమా కొత్త దర్శకుడితో ఏం ధైర్యంతో చేశావ్ అనగానే బాహుబలి కి ముందు దొరికిన గ్యాప్ లో లాగించేశానని చెప్పాడు. తన ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్ కావటం... కథ బాగుండటం... కొరటాల శివపై నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేశామని వర్కవుట్ అయ్యిందని ప్రభాస్ చెప్పాడు. ''నీకైతే ఒకటి వర్కవుట్ అయ్యిందిలే'' అంటూ బాలయ్య కొంటెగా అడిగితే సిగ్గు పడటం తప్ప ప్రభాస్ ఏం చేయలేకపోయాడు. సో అనుష్కను ఉద్దేశించి బాలయ్య ఈ క్వశ్చన్ అడిగారా? క్లారిటీ లేదు.
Also Read : టాప్ గేర్ రివ్యూ: ఆది సాయికుమార్ సినిమా టాప్ గేర్‌లో దూసుకుపోయిందా?
మొత్తంగా సననా..శెట్టినా..అని బాలయ్య పాయింట్ బ్లాక్ క్వశ్చన్స్ అడిగినా..ప్రభాస్ సిగ్గుతో మేనేజ్ చేసేశాడు. చరణ్ ఇచ్చిన లీకుకు బలం చేకూర్చేలా ఎపిసోడ్ రెండో పార్ట్ లో గోపీచంద్ ఏం కామెంట్స్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?