అన్వేషించండి

సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబోలో మూవీ అందుకే ఆగిపోయిందట

ఇటీవల రిలీజైన'పఠాన్'తో విజయం సాధించిన డైరెక్ట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని ఎప్పట్నుంచో టాక్ నడుస్తోంది.కానీ ఈ మూవీ ఇప్పటివరకు ముందుకు సాగలేదు. అందుకు కారణాలు రివీల్ అయ్యాయి

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలలో నటించిన, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం 'పఠాన్'.. ఇటీవలే రిలీజై .. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత, మైత్రి ప్రొడక్షన్ లో యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ కోసం తెలుగు స్టార్ ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాడంటూ గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా సిద్ధార్థ్- ప్రభాస్ కాంబో ఇప్పట్లో కుదిరేలా లేదని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఇంతకు ముందు మైత్రి మూవీస్ తో రూ.65కోట్లకు సంతకం చేసిన ఒప్పందాన్ని కూడా ఇటీవలే రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీని నిలిపివేసినట్టు వస్తోన్న టాక్ కు మరింత ఆజ్యం పోసేదిలా ఉంది. 

ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి టీమ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రస్తుతం ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయిన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా కోసం అడ్వాన్స్ గా పొందిన మొత్తాన్ని కూడా సిద్దార్థ్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలోనే అత్యంత బిజీగా ఉండే వారిలో ప్రభాస్, సిద్దార్థ్ లు ఒకరు. ప్రస్తుత ప్రభాస్ చేతిలో మూడు సినిమాలుండగా.. సిద్ధార్థ్ 'ఫైటర్', 'టైగర్ వర్సెస్ పఠాన్' లతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఇప్పటికే  'టైగర్ v/s పఠాన్' తర్వాత.. 'ఫైటర్ 2' ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ప్రభాస్, ఇటు సిద్దార్థ్ లకు డేట్స్ కుదరకపోవడం, ఖాళీగా లేకపోవడం వల్ల వీరిద్దరి కాంబో సెట్ కావటం లేదని, అందుకే ఈ వీరి కాంబినేషన్లో మూవీ నిలిచిపోయిందని తెలుస్తోంది.

ప్రభాస్ రాబోయే సినిమాలు

ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' చిత్రంతో బిజీగా ఉండగా.. ఈ సినిమా జూన్ 16న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముందు నుంచీ అడ్డంకులు, వివాదాలే ఎదురవుతున్నాయి. సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ పైనా వివిధ విమర్శలు రావడంతో మేకర్స్ మరోసారి విజువల్స్ ఎఫెక్స్ట్ మార్పుపై దృష్టి సారించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 9 రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఓ రోజు ముందుగానే ఫ్యాన్స్ కోసం త్రీడీ ట్రైలర్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు టాక్ కూడా వస్తోంది. ఆదిపురుష్ ట్రైలర్ చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఈ మూవీ టీంను ప్రశంసిస్తూ ఇటీవలే ట్వీట్ కూడా చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ చూడడం ఆనందంగా ఉందని, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పారు, శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూపుతుందన్న ఆయన.. ఈ సినిమాలోని పాత్రలకు నటీనటులంతా జీవం పోశారని ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో పాటు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సాలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. వీటితో పాటు 2024లో ప్రాజెక్ట్ K,రాజా డీలక్స్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Love Insurance Kompany OTT: ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ 'లైక్' - ఒకేసారి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ 'లైక్' - ఒకేసారి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Car Care Tips: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget