Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి, షాక్‌లో అభిమానులు
Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయింది. 32 ఏళ్ల వయసున్న ఆమె, గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె పీఆర్ టీమ్ అధికారికంగా ధృవీకరించింది.

బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన నివాసంలో రాత్రి తుదిశ్వాస విడిచినట్లు పీఆర్ టీమ్ వెల్లడించింది. ‘‘ఈ ఉదయం మేం ఎంతో బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నాం. మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంది. ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం” అని పూనమ్ సిబ్బంది వెల్లడించారు. తన స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.
View this post on Instagram
2013లో బాలీవుడ్ లోకి ఎంట్రీ
మోడల్ గా, నటిగా పూనమ్ పాండే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే తన దుస్తులు విప్పేస్తాను అని చెప్పడంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. నిజానికి పూనమ్ తన సినిమాల కంటే వివాదాస్పద అంశాలతోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక పూనమ్ పాండే సామ్ బాంబేను గతంలో వివాహం చేసుకుంది. కొంత కాలం పాటు వీరిద్దరు వీడియోలు చేస్తూ బాగా హల్ చల్ చేశారు. 2020లో పూనమ్ అతనిపై గృహ హింస ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అతడితో దూరం అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యింది. ఇక చిన్న వయసులోనే పూనమ్ చనిపోవడంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖలు, అభిమానులు, నెటిజన్లు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















