Pooja Hegde: ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో, పూజాహెగ్డే పోస్ట్
తన ఫ్యామిలీను తీసుకొని మరోసారి మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లింది పూజా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. ఇప్పుడు ఈ బ్యూటీకి బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ 'బీస్ట్' సినిమాను పూర్తి చేసింది పూజా. ప్రస్తుతం బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన 'సర్కస్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న 'భాయ్ జాన్' సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ గానే మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లొచ్చింది.
ఆ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తన ఫ్యామిలీను తీసుకొని మరోసారి మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లింది పూజా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాదాపు 13 ఏళ్ల తరువాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్లు చెప్పింది. ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇందులో తన తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
అయితే దీనికంటే ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఎయిర్ పోర్ట్ లో తన తల్లిదండ్రులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన తండ్రిపై సెటైర్లు కూడా వేసింది. తన తండ్రి ఇచ్చిన పోజులను చూపిస్తూ.. 'మా ఇంట్లో నేనొక్కదాన్నే నటిని అనుకున్నాను.. కానీ ఇంకొకరు కూడా ఉన్నారంటూ' తన తండ్రిని చూపించింది. ఈ పోస్ట్ లపై నెటిజన్లు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పూజా తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటించబోతుంది.
View this post on Instagram