అన్వేషించండి

Pathaan Teaser:నాలుగేళ్ల గ్యాప్ తరువాత షారూక్ సినిమా - పఠాన్ టీజర్ అదిరిపోయింది

షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా 'పఠాన్'. నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.

 షారుఖ్‌ఖాన్‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. షారుక్ ఖాన్  తాజాగా నటించిన సినిమా 'పఠాన్'. నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. అయితే షారుఖ్‌ ఖాన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. ‘జీరో’ సినిమా తర్వాత ఇప్పటివరకూ షారుఖ్ నటించిన సినిమాలేమీ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్‌ రోల్స్ లో కనిపించినా అవి ఫ్యాన్స్ కు అంతగా సంతృప్తి ని ఇవ్వలేదు. షారుఖ్ ఫుల్ లెన్త్ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తోన్న మూడు సినిమాల్లో 'పఠాన్' ఒకటి. ఇప్పుడీ టీజర్‌తో షారుఖ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. 

ఇక టీజర్ విషయానికొస్తే 'పఠాన్' టీజర్ తో మళ్ళీ షారుఖ్ ఖాన్ సత్తా ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నట్టు ఉంది. టీజర్ ఒక బ్యాగ్రౌండ్ వాయిస్ తో ప్రారంభం అవుతుంది. 'ఏం తెలుసు నీకు పఠాన్ గురించి' అని వాయిస్ వినిపిస్తుంది. దానికి  సమాధానంగా 'మూడేళ్ళుగా అతని గురించి ఏ సమాచారం లేదు' అని లేడి వాయిస్ వస్తుంది.  ‘అతని లాస్ట్ మిషన్ లో అతను పట్టుబడ్డాడు, వాళ్ళ చేతుల్లో చనిపోయాడా లేదా’ అనే డైలాగ్ పూర్తవగానే 'బ్రతికే ఉన్నాడు' అని నవ్వుతూ డైలాగ్ చెప్తూ షారుఖ్ ఎంట్రీని చూపించారు. ఇక తర్వాత టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్స్ తో అదిరిపోయిందనే చెప్పాలి. చివరిలో షారుఖ్ 'మీ కుర్చీకి బెల్ట్ బిగించుకోండి, వాతావరణం మారుతోంది' అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది. 

టీజర్ నిమిషం పైనే ఉండటంతో విజువల్స్ బాగా చూపించారు. పఠాన్(షారుఖ్) క్యారెక్టర్ కు తగ్గట్టు గానే విలన్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నారు. సినిమాలో ఇద్దరికీ విపరీతమైన పోటీ ఉంటుంది అని టీజర్ లో చెప్పకనే చెప్పారు మేకర్స్. టీజర్ లో వి.ఎఫ్.ఎక్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోవడంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. సినిమాలో మరోసారి దీపికా పదుకునే షారుఖ్ కు జంటగా నటించింది. 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' వంటి పలు చిత్రాల్లో షారుక్‌తో కలిసి నటించిన దీపికా 'పఠాన్' లో మరోసారి జంటగా కనిపించింది. 

ఓవరాల్ గా టీజర్ షారుఖ్ ఫ్యాన్స్ కు షారుఖ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. నిజానికి షారుఖ్ ఖాన్ పై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక షారుఖ్ పని అయిపోందని, సినిమాలకు షారుఖ్ దూరం అయ్యారు అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ షారుఖ్ 'పఠాన్' టీజర్ తో సమాధానం చెప్పాడని అనుకోవచ్చు. అందుకే టీజర్ లో డైలాగ్స్ కూడా షారుఖ్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా షారుఖ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 లో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Ramakrishna: ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు
ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు
Gunde Ninda Gudi Gantalu Mai 12th Episode:బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
Suriya: హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
హైదరాబాద్‌లో సూర్య కాళ్ళ మీద పడిన వీరాభిమాని... షాక్‌లో కార్తీ
Podharillu Serial Today May 12th: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?
పొదరిల్లు: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget