అన్వేషించండి

Sunflower S2 Trailer: ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 2 ట్రైలర్ - పిచ్చెక్కించే మిస్టరీ స్టోరీలో ఊహించని ట్విస్ట్, డిన్నర్‌తోపాటు అన్నీ అంటున్న అదా శర్మ

Sunflower S2: జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సన్‌ఫ్లవర్ సీజన్ 1’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. తాజాగా ‘సన్‌ఫ్లవర్ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Sunflower S2 Trailer Out Now: ఇంగ్లీష్‌లో క్రైమ్ కామెడీ సిరీస్‌లు చాలా పాపులర్. ఇండియన్ భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ జోనర్‌లో వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి హిట్లు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ క్రైమ్ కామెడీ జోనర్‌లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే ‘సన్‌ఫ్లవర్’. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఒక సీజన్‌ను పూర్తి చేసుకోగా.. ఫస్ట్ సీజన్‌కు మంచి ఆదరణ లభించడంతో మేకర్స్ రెండో సీజన్‌ను ప్లాన్ చేశారు. జీ5 ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘సన్‌ఫ్లవర్ 2’ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇక సీజన్ 2లో అదా శర్మ కూడా సునీల్ గ్రోవర్ టీమ్‌తో కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. 

మరో మర్డర్..

‘సన్‌ఫ్లవర్’ అనే అపార్ట్‌మెంట్స్‌లో హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేశారో తెలుసుకునే పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్ దిగేంద్ర పాత్రలో రణవీర్ షోరే నటించారు. ఇక ఇందులో హీరోగా సునీల్ గ్రోవర్.. సోనూ సింగ్ అనే పాత్రలో కనిపించారు. వీరితో పాటు గిరీష్ కులకర్ణి, ముకుల్ చడ్డా, రాధా భట్, ఆశిష్ విద్యార్థి కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 1లో అదా శర్మ లేదు. సీజన్ 2లో తాను కూడా ‘సన్‌ఫ్లవర్’ అపార్ట్‌మెంట్స్‌లోకి కొత్తగా వచ్చిన రోజీ మెహతా పాత్రలో అదా కనిపించనుంది. అదా శర్మ పాత్ర ఈ వెబ్ సిరీస్‌కు గ్లామర్‌ను యాడ్ చేయనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అదా శర్మ చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది. సునీల్ గ్రోవర్‌ (సోను).. డిన్నర్‌కు పిలిస్తే.. డిన్నర్‌తో సె* కూడా చేసేద్దాం అంటుంది అదా(రోజీ). ఇంతకీ.. హంతకుడు ఎవరు? అనేది సీజన్ 2లో తేలుతుందో లేదో చూడాలి. ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 1 తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

అదా శర్మ ఎంట్రీతో సర్‌ప్రైజ్..

2024 మార్చ్ 1న ‘సన్‌ఫ్లవర్ 2’ జీ5 సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుందని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రకటించింది. ‘సన్‌ఫ్లవర్ సొసైటీలో మరో మర్డర్ జరిగింది. ఇందులో కూడా సోనూనే ప్రధాన అనుమానితుడిగా నిలిచాడు. బిల్డింగ్‌లో కొత్తగా కొందరు అనుమానితులు చేరారు. వీరందరిలో ఎవరు రియల్ కిల్లర్? సన్‌ఫ్లవర్ 2లో ఈ డార్క్ కామెడీని చూడండి’ అంటూ ‘సన్‌ఫ్లవర్ 2’ ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది జీ5. ఇందులో అదా శర్మ పాత్రలో కొంచెం సస్పెన్స్ యాడ్ చేసినట్టు ట్రైలర్‌లో తెలుస్తోంది. ‘‘భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్న సన్‌ఫ్లవర్‌లాంటి సీరీస్‌లో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ అదా సంతోషం వ్యక్తం చేసింది.

అమాయకంగా అబద్ధాలు చెప్తుంది..

‘‘నా క్యారెక్టర్ రోజీ అనేది సిరీస్‌కు మరో కొత్త లేయర్‌ను యాడ్ చేస్తుంది. రోజీ చాలా తెలివైనది. చాలా అందంగా ఉంటుంది కానీ తనలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. రోజీ సన్‌ఫ్లవర్ సొసైటీలో ఉండడానికి వచ్చి అందరి జీవితాలను తలకిందులు చేస్తుంది. తను ఒక లక్ష్యంతోనే అక్కడ అడుగుపెడుతుంది. తను ముందుగా బార్ డ్యాన్సర్ అని చెప్తుంది కానీ ఎపిసోడ్స్ గడుస్తున్నకొద్దీ తను అమాయకంగా అబద్ధాలు చెప్తూ అందరినీ మోసం చేస్తుందని అర్థమవుతుంది’’ అంటూ ‘సన్‌ఫ్లవర్’లో తన పాత్ర గురించి రివీల్ చేసింది అదా శర్మ. ‘సన్‌ఫ్లవర్’ సీజన్ 1ను వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేయగా.. సీజన్ 2కు మాత్రం నవీన్ గుజ్రాల్ దర్శకుడిగా వ్యవహరించాడు. 

Also Read: రష్మికకు అరుదైన ఘనత - ఫోర్బ్స్‌ జాబితాకు ఎక్కిన 'శ్రీవల్లి'

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget