Vijay Varma: ‘మీర్జాపూర్ 3’లో గోలు, చోటే త్యాగీ మధ్య రొమాంటిక్ సీన్స్ - కోఆర్టినేటర్ సమక్షంలో అలా చేశారట
Vijay Varma: వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన విజయ్ వర్మ.. త్వరలో ‘మీర్జాపూర్ 3’తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో శ్వేతా త్రిపాఠీతో ఉండే రొమాంటిక్ సీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Vijay Varma About Mirzapur Romantic Scenes: దేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులు చూసిన వెబ్ సిరీస్ లిస్ట్‌లో ‘మీర్జాపూర్’ కూడా ఒకటి. అందుకే ఈ సిరీస్ రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకొని మూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. 2024 జులై 5న ‘మీర్జాపూర్ 3’ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. శ్వేతా త్రిపాఠి.. ‘మీర్జాపూర్’ మొదటి సీజన్ నుండి గోలూ పాత్రలో అలరిస్తోంది. ఇక విజయ్ వర్మ చోటే త్యాగిగా రెండో సీజన్‌లో ఎంటర్ అయ్యాడు. ఇక ఈ రెండో సీజన్‌లో విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి మధ్య ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. అక్కడే ఎపిసోడ్ కూడా ఆగిపోతుంది. తాజాగా దానిపై విజయ్ వర్మ తాజాగా స్పందించాడు.
గోలూ పాత్ర అలాంటిది..
ఒక అబ్బాయి.. తనకు జీవితం గురించి నేర్పించే ఒక అమ్మాయితో పిచ్చి ప్రేమలో ఉన్నప్పుడు వచ్చే సీన్ అంటూ తనకు, శ్వేతా త్రిపాఠికి మధ్య ఉండే రొమాంటిక్ సీన్ గురించి చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. ‘‘గోలూతో త్యాగి సాన్నిహిత్యంగా ఉండడాన్ని తను రహస్యంగా ఉంచాలి. గోలూ మొదట్లో మామూలు అమ్మాయిలాగా కనిపిస్తుంది. కానీ తను మొదటి సీన్‌లో లైబ్రరీలో ఒక అడల్ట్ పుస్తకం చదువుతూ కనిపించడం చాలామంది మర్చిపోయి ఉంటారు. తనకు అలాంటివి చాలా ఇష్టం. అదే తను త్యాగికి కూడా పరిచయం చేస్తుంది. ఆ సీన్‌లో కేవలం వారిద్దరూ శారీరకంగా దగ్గరవ్వడం మాత్రమే కనిపించినా.. జీవితం ఎలా ముందుకెళ్తుంది అనేది అందులో ఉంది’’ అని గోలూ, చోటే త్యాగి పాత్రల గురించి వివరించాడు విజయ్ వర్మ.
కో ఆర్డినేటర్ ఉన్నారు..
‘‘చాలామంది తమ పార్ట్‌నర్స్ నుండి మొదట్లోనే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఒకవేళ ఒక అబ్బాయి.. తనకు తగిన అమ్మాయిని కలిస్తే తనలో చాలా మార్పులు వస్తాయి’’ అంటూ తన పర్సనల్ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. ‘మీర్జాపూర్ 3’ సెట్‌లో శ్వేతా త్రిపాఠితో తన రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఒక కో ఆర్డినేటర్ కూడా అక్కడ ఉన్నారని రివీల్ చేశాడు. ముందు రెండు సీజన్స్‌లో అలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నాడు. ‘‘కో ఆర్డినేటర్ ఉండడం అనేది చాలా అవసరంగా మారింది. వారి ట్రైనింగ్ వల్లే ఆ సీన్ షూటింగ్ అప్పుడు ఒక సేఫ్ వాతావరణం క్రియేట్ అయ్యింది’’ అని తెలిపాడు విజయ్ వర్మ.
టెన్షన్ ఉంటుంది..
కో ఆర్డినేటర్ చెప్పిన కొన్ని సలహాలు, చిట్కాలు తమకు చాలా సహాయపడ్డాయని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. మామూలుగా రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సెట్ అంతా ఒకరకమైన టెన్షన్‌తో ఉంటుందని కానీ కో ఆర్డినేటర్ ఉండి, ఆ సీన్స్‌ను కొరియోగ్రాఫీ చేయడం వల్ల అంతా సులువుగా అయిపోయిందన్నాడు. అందులో చాలా టెక్నికల్ వివరాలు కూడా ఉంటాయన్నాడు. ఇక ‘మీర్జాపూర్ 3’ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉండడంతో ఈ సిరీస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందు సీజన్స్‌లాగా ఇందులో కూడా పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.