అన్వేషించండి

Citadel Web Series: అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది - ‘సిటాడెల్’పై అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్

Citadel Web Series: రాజ్, డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న వెబ్ సిరీసే ‘సిటాడెల్’. తాజాగా ఈ సిరీస్‌పై అప్డేట్ అందించాడు వరుణ్. అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోందని చెప్పుకొచ్చాడు.

Citadel Web Series Update by Varun Dhawan: సమంతను మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తారు. ఇప్పట్లో తన చేతిలో సినిమాలు ఏమీ లేవు కాబట్టి వెండితెరపై ఇప్పట్లో సామ్‌ను చూడడం కష్టమే. కానీ త్వరలోనే తను ఒక యాక్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది. అదే ‘సిటాడెల్’. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ‘సిటాడెల్’ నుండి క్రేజీ అప్డేట్ రానుందని ఇందులో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ బయటపెట్టారు. ఈ అప్డేట్ గురించి చెప్పడం కోసం వరుణ్.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అప్పుడే చెప్పకూడదు..

‘‘అందరికీ హలో. నేను మీ ప్రైమ్ స్నేహితుడిని. సీక్రెట్ న్యూస్ తీసుకొచ్చేశాను. 2024లోనే అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది’’ అంటూ వరుణ్ ధావన్ ఏదో చెప్పబోతుండగా.. సార్ ఇవన్నీ చెప్పకూడదు అంటూ పక్కన నుండి వాయిస్ వినిపిస్తుంది. ‘‘ఇప్పుడు చెప్పకూడదు కానీ మార్చి 19కి చెప్పొచ్చు కదా. మీరు సిద్ధమేనా?’’ అంటూ వీడియోను ముగించాడు వరుణ్ ధావన్. ఈ వీడియోలో ఎక్కడా తను ‘సిటాడెల్’ పేరు ఉపయోగించలేదు. కానీ అమెజాన్ ప్రైమ్‌తో కలిసి పోస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇది ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అప్డేట్ గురించే అని అర్థమవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

ఇదే సూచన..

‘మీ ప్రైమ్ స్నేహితుడిని నమ్మండి. ఇదే మీకు సూచన. మార్చి 19 కోసం ఎదురుచూడండి’ అంటూ ఈ వీడియోను అమెజాన్ ప్రైమ్ పేజ్, వరుణ్ ధావన్ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సిటాడెల్’ అనేది అదే పేరుతో ఉన్న అమెరికన్ వెబ్ సిరీస్‌కు తెలుగు వర్షన్‌గా తెరకెక్కింది. అమెరికన్ వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో నటించింది. ఈ రీమేక్‌లో ప్రియాంక చోప్రా పాత్రను సమంత పోషిస్తోంది. రాజ్, డీకేలు దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. దర్శకులతో కలిసి వరుణ్ ధావన్, సమంత కలిసి టీజర్ కట్‌ను చూశారు. టీజర్ చాలా బాగా వచ్చిందని చాలాకాలం క్రితమే సమంత, వరుణ్ కలిసి తమ సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు కూడా.

అన్నీ హిట్టే..

హిందీ వెబ్ సిరీస్‌లను ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకులు రాజ్, డీకే. ఇప్పటికీ వీరు తెరకెక్కించిన ప్రతీ హిందీ వెబ్ సిరీస్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి ‘సిటాడెల్’ కూడా చేరనుంది. పైగా సమంత ఇందులో లీడ్ రోల్ చేయడం ఈ సిరీస్‌కు మరింత హైప్ క్రియేట్ చేయనుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడంతో పాటు యాక్షన్ సీన్స్‌లో కూడా నటించి హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందుకే ఇప్పటివరకు నేరుగా ఒక్క హిందీ సినిమా కూడా చేయకపోయినా.. బాలీవుడ్‌లో సమంతకు మంచి గుర్తింపు లభించింది.

Also Read: నా 53 ఏళ్ల కెరీర్‌లో అలాంటిది జరగలేదు - సందీప్ వంగాపై జావేద్ అఖ్తర్ ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
AZADI 501 Release Date: ఆజాదీ 501 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఆహా ఓటీటీలో టెక్ స్కామ్ సిరీస్‌ను ఎప్పట్నించి చూడొచ్చంటే?
ఫ్రీడమ్ 251తో జనాలకు బోడిగుండు... ఇప్పుడు ఆహా ఓటీటీకి 'ఆజాదీ 501'గా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget