అన్వేషించండి

Unstoppable with NBK: ఆహాకు తిరిగొస్తున్న ‘అన్‌స్టాపబుల్’ - ప్యాన్ ఇండియా గెస్ట్ లిస్ట్ రెడీ

Unstoppable with NBK: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఆ షోకు మరో సీజన్ సిద్ధమవుతోంది. ఇందులో ప్యాన్ ఇండియా గెస్టులు రాబోతున్నట్టు సమాచారం.

Unstoppable with NBK New Season: ఈరోజుల్లో చాలామంది హీరోహీరోయిన్లు ఓటీటీల ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ముందుగా సినిమాల నుండి వెబ్ సిరీస్‌ల వైపు వచ్చి అందరినీ అలరించడం మొదలుపెట్టారు. వెబ్ సిరీస్‌ల తర్వాత టాక్ షోలు కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయడం మొదులపెట్టాయి. అందుకే కొందరు నటీనటులు టాక్ షోలకు హోస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరో బాలయ్య సైతం తాను హోస్ట్‌గా పరిచయమవుతున్నట్టు ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయన హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి కొత్త సీజన్‌కు సిద్ధమవుతోంది.

అప్పటినుండి స్టార్ట్..

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో ఇప్పటికీ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ షోలో బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. దీంతో ఓటీటీ టాక్ షోకు సంబంధించిన ఎన్నో రికార్డులను ‘అన్‌స్టాపబుల్’ బ్రేక్ చేసింది. ఇప్పుడు మరో సీజన్‌తో ఈ టాక్ షో సిద్ధమవుతోంది. ఈ సరికొత్త సీజన్ కోసం గెస్ట్ లిస్ట్ ఇప్పటికే రెడీగా ఉన్నట్టు సమాచారం. 2024 అక్టోబర్‌లో దసరా పండుగా సందర్బంగా ‘అన్‌స్టాపబుల్’ కొత్త సీజన్ ప్రీమియర్ కానుంది. ఈసారి కేవలం తెలుగు నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు... ఈ షోలో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు.

రాజకీయ నాయకులు కూడా..

ఇంతకు ముందు ప్రసారమయిన ‘అన్‌స్టాపబుల్’ సీజన్స్‌లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి హీరోలను గెస్టులుగా ఆహ్వానించారు బాలకృష్ణ. మామూలుగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమా ప్రమోషన్స్‌కు కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి ఆలోచిస్తారు. అలాంటి వీరిని తీసుకొచ్చి వారే స్వయంగా తమ పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకునేలా చేశారు బాలయ్య. దీంతో ఈ షో వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. ఇక బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడం ‘అన్‌స్టాపబుల్’కు పెద్ద ప్లస్ అయ్యింది. కేవలం సినీ తారలను మాత్రమే కాకుండా నారా కుటుంబం నుండి చంద్రబాబు, లోకేశ్ వచ్చి వ్యూయర్స్‌ను ఆశ్చర్యపరిచారు.

ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు..

ఇప్పటివరకు ‘అన్‌స్టాపబుల్’లో వచ్చినవారి గెస్ట్ లిస్ట్ చూస్తుంటే తరువాతి సీజన్‌లో ఇంకా ఎవరెవరు గెస్టులుగా రానున్నారో అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈసారి చాలావరకు ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇతర ఇండస్ట్రీల్లో ప్యాన్ ఇండియా స్టార్లుగా ఎదిగినవారు ‘అన్‌స్టాపబుల్’లో బాలయ్యతో కలిసి తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ముచ్చటించనున్నారు. ముందుగా మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఈ షోకు గెస్టులుగా వస్తారని వార్తలు వచ్చినప్పుడు కూడా చాలామంది నమ్మలేదు. అలాగే ఈసారి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే మరెందరో సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి ‘అన్‌స్టాపబుల్’లో బాలయ్యతో కలిసి అలరించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ పలు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా.. అక్టోబర్ వరకు డేట్స్ అడ్జస్ట్ చేసుకొని తన టాక్ షో కోసం సిద్ధమవ్వనున్నారు.

Also Read: శోభిత ధూళిపాళ బ్యాక్‌గ్రౌండ్, లా నుంచి మోడలింగ్‌ వరకు... చైతూకు కాబోయే భార్య గురించి ఈ విషయాలు తెల్సా?

టాప్ హెడ్ లైన్స్

Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Shivlok Ke Kundakka Mandakka: జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget