అన్వేషించండి

Premalu OTT: ఓటీటీలోకి ‘ప్రేమలు’ - వచ్చేది ఎప్పుడంటే?

మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’ ఓటీటీ ప్లాట్ఫాTమ్ ఫిక్స్ అయ్యింది. త్వరలో తెలుగులో థియేటర్లలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలో ఓటీటీ డీల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

Premalu OTT: మలయాళీ సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై, పెద్ద హిట్ అందుకున్న మూవీ ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తోంది. సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‍ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగా వసూళు చేసింది. ఫిబ్రవరి 9న విడుదల కాగా, ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. త్వరలో ఈ మూవీ తెలుగులోనూ విడుదలకు రెడీ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళీ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా, త్వరలో తెలుగులోనూ థియేటర్లలో ఆకట్టుకోబోతోంది.

‘ప్రేమలు’ ఓటీటీ డీప్ కంప్లీట్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమా ఓటీటీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రైట్స్ కోసం డిస్నీ+ హాట్‍ స్టార్ భారీ మొత్తం వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే, ఎంతకు కొనుగోలు చేసింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు.   

ఓటీటీ విడుదల ఇప్పట్లో లేనట్టే?

‘ప్రేమలు’ మూవీ విడుదలై నాలుగు వారాలు దగ్గరవుతోంది. నిజానికి ఇటీవల చాలా సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. అయితే, ‘ప్రేమలు’ సినిమా థియేటర్లలో చక్కగా రన్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యేనా?   

ఇక ‘ప్రేమలు’ సినిమాలో  నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. తెలుగు వెర్షన్ మూవీకి ఈ పాయింట్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 8న ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.

Read Also: రాశీఖన్నా.. ‘ది సబర్మతి రిపోర్ట్‌’ టీజర్: గోద్రా ఘటన ప్రమాదం కాదు, అసలు నిజం ఏమిటీ?

టాప్ హెడ్ లైన్స్

Comedy Drama OTT: ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget