అన్వేషించండి

Devil Movie OTT: ‘డెవిల్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్!

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్’.. థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ఇంతలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ప్లాట్‌ఫార్మ్ ఏదనే విషయం బయటికొచ్చింది.

విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొడుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో ‘డెవిల్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. ‘డెవిల్’ మూవీ ఓటీటీ రైట్స్ గురించే కాదు.. శాటిలైట్ రైట్స్ గురించి కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం.

ఓటీటీ రైట్స్ వారికే..
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘డెవిల్’.. ఈ శుక్రవారం థియేటర్లలో సందడిని మొదలుపెట్టింది. మార్నింగ్ షో నుండే ఈ సినిమాకు పాజిటిక్ టాక్ లభిస్తోంది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్.. ‘డెవిల్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఈటీవీ ‘డెవిల్’ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ ఎంత ఖర్చు పెట్టాయనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ సంపాదించుకోవడంతో కచ్చితంగా ఈ రైట్స్ కోసం సంస్థలు భారీగానే ఖర్చుపెట్టుంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లక్కీ లేడీ..
‘డెవిల్’ మూవీ టాక్ చూస్తుంటే కళ్యాణ్ రామ్‌కు సంయుక్త మీనన్ లక్కీ లేడీ అయిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘డెవిల్’ కూడా కొన్నిరోజుల పాటు ఇదే పాజిటివ్ రెస్పాన్స్‌ను కొనసాగించగలిగితే.. ఈ మూవీ కూడా ‘బింబిసార’ రేంజ్‌ను అందుకోగలుగుతుంది. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త మీనన్‌తో పాటు మరో కీలక పాత్ర పోషించిన మరో హీరోయిన్ మాళవికా నాయర్ కూడా అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. వీరితో పాటు ప్రతీ యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు.

డైరెక్టర్ వర్సెస్ ప్రొడ్యూసర్..
ఎన్నో కాంట్రవర్సీల మధ్య ‘డెవిల్’ చిత్రం విడుదలయ్యింది. ముందుగా ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకుడిగా ఎంపికయ్యాడు. కానీ కొన్నిరోజులకే మూవీ పోస్టర్లపై తన పేరు కాకుండా అభిషేక్ నామా పేరు కనిపించింది. అసలైతే అభిషేక్ నామా.. సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. కానీ దర్శకుడిగా కూడా అభిషేక్ పేరే కనిపించడంపై నవీన్ స్పందించాడు. తను ఎంతో కష్టపడి షూటింగ్ చేశానని, మూవీ మొత్తం తనే డైరెక్ట్ చేశానని, తన కష్టాన్ని బలవంతంగా లాగేసుకొని కనీసం దర్శకుడిగా తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని నవీన్ వాపోయాడు. అయితే నవీన్ పనితీరు నచ్చలేదని, అందుకే తీసేశామని అభిషేక్ నామా తెలిపాడు. ఇన్ని కాంట్రవర్సీలు మధ్య విడుదలయిన ‘డెవిల్’.. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

Also Read: డెవిల్ ఆడియన్స్ రివ్యూ: బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్ - సోషల్ మీడియాలో టాక్ చూశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Patriot OTT : ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gayapadda Simham OTT : ఓటీటీలోకి గాయపడ్డ సింహం - సడన్‌గా తరుణ్ భాస్కర్ కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి గాయపడ్డ సింహం - సడన్‌గా తరుణ్ భాస్కర్ కొత్త మూవీ స్ట్రీమింగ్
Friday OTT Movies : ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
Uthutha Herolu OTT : ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Prime Minister Narendra Modi warns Union Ministers బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!
అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!
NEET UG 2026 Fee Refund: NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!
NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!
IPL 2026 SRH VS RCB Result Update: ఆర్సీబీపై SRH ప్ర‌తీకార విజ‌యం.. ఎలిమినేట‌ర్ కు అర్హ‌త‌.. రాణించిన కిష‌న్, అభిషేక్ క్లాసెన్, మ‌లింగా
ఆర్సీబీపై SRH ప్ర‌తీకార విజ‌యం.. ఎలిమినేట‌ర్ కు అర్హ‌త‌.. రాణించిన కిష‌న్, అభిషేక్ క్లాసెన్, మ‌లింగా
Numarology: 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నాయకులుగా ఎదుగుతారు కానీ ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి
3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నాయకులుగా ఎదుగుతారు కానీ ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి!
Embed widget