అన్వేషించండి

Horror Movies: ఆ ఓటీటీలోకి రెండు హాలీవుడ్ హర్రర్ మూవీస్ - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

Hollywood Horror Movies: హాలీవుడ్‌ నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన రెండు హారర్ చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాయి.

రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. ఇక అలాంటి భయపెట్టే హారర్ జోనర్‌కు ప్రాణం పోసింది హాలీవుడ్. ఇంగ్లీష్‌లో ఇప్పటివరకు ఎన్నో హారర్ సినిమాలు విడుదలయ్యాయి. పైగా అక్కడ హారర్ మూవీస్‌తో యూనివర్స్‌లు కూడా క్రియేట్ చేస్తారు మేకర్స్. అలా రెండు వేర్వేరు యూనివర్స్‌ల నుండి విడుదలయిన రెండు వేర్వేరు హారర్ చిత్రాలు.. ఒకేసారి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. ఒకటి ‘కంజ్యూరింగ్’ యూనివర్స్‌ నుండి వచ్చిన మూవీ అయితే.. మరొకటి ‘ఎగ్జార్సిస్ట్’ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన సినిమా. ఒకే ఓటీటీలో రెండు హారర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. 

 ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ మూవీ తెలుగులోనూ చూడొచ్చు

‘ది ఎగ్జార్సిస్ట్’ మూవీ హాలీవుడ్‌లోని ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ సినిమాలలో ఒకటి. ముందుగా హారర్ ఫ్రాంచైజ్ చిత్రాలకు హైప్ క్రియేట్ చేసిందే ‘ది ఎగ్జార్సిస్ట్’. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుండి ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టగా.. నాలుగు నెలల క్రితం ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ అనే మరో సినిమా కూడా థియేటర్లలో విడుదలయ్యి ఆడియన్స్‌ను భయపెట్టింది. ఓవర్సీస్‌లో నాలుగు నెలల క్రితం విడుదలయిన ఈ మూవీ.. ఇప్పుడు ఇండియాలో ఓటీటీలో విడుదలైంది. 1973లో ‘ది ఎగ్జార్సిస్ట్’ ఫ్రాంచైజ్ నుండి మొదటి మూవీ విడుదలయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్‌లో ఆరు సినిమాలు తెరకెక్కగా.. అందులో ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ కూడా అందులో యాడ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో సినిమాలో ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ మూవీని పిల్లలతో మాత్రం చూడకండి. భయపడతారు. 

‘ది నన్ 2’ చూడాలంటే ధైర్యం ఉండాలి

 ‘ది ఎగ్జార్సిస్ట్’ ఫ్రాంచైజ్‌లాగానే హాలీవుడ్ హారర్ మూవీ లవర్స్‌కు విపరీతంగా నచ్చిన హారర్ యూనివర్స్ ‘కంజ్యూరింగ్’. తాజాగా ఈ యూనివర్స్ నుండి ‘ది నన్ 2’ అనే హారర్ మూవీ విడుదలయ్యింది. 2018లో విడుదలయిన ‘ది నన్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది ‘ది నన్ 2’. ‘ది నన్’ అప్పట్లో కంజ్యూరింగ్ యూనివర్స్‌లోని సినిమాగా విడుదలయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక దానికి సీక్వెల్‌గా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ది నన్ 2’. థియేటర్లలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సీక్వెల్.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ‘ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్’లాగానే ‘ది నన్ 2’ కూడా జియో సినిమాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో కూడా ‘ది నన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీని కూడా పిల్లలతో కలిసి చూడవద్దు. కేవలం ఒంటరిగా లేదా ఫ్రెండ్స్‌తో కలిసి మాత్రమే చూడండి. 

Also Read: ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ - ఆ రోజు ఏం జరిగింది? ఆ థ్రిల్లర్ మూవీకి ప్రీక్వెల్ వ‌చ్చేస్తోంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget