అన్వేషించండి

Sasimadhanam Teaser: తండ్రి గుణ‌పం అయితే కూతురు బ‌ల‌పం అవుతుందా? - రొమాంటిక్, కామెడీతో ఆకట్టుకుంటున్న 'శ‌శిమ‌థ‌నం' టీజ‌ర్..

Sasimadhanam Teaser: ఈ మ‌ధ్య‌కాలంలో వెబ్ సీరీస్ కి ఆద‌ర‌ణ బాగా పెరిగిపోతుంది. వ‌రుసపెట్టి ఆయా ఓటీటీలు వెబ్ సీర‌స్ ల‌ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ లో కొత్త వెబ్ సీరిస్ రాబోతుంది.

Sasimadhanam Teaser Out Now Win Original Series: ఈటీవీ విన్.. వ‌రుస వెబ్ సిరీస్ ల‌తో దూసుకుపోతుంది. ఈ మ‌ధ్యే రిలీజైన 90స్ వెబ్ సిరీస్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు 'శ‌శిమ‌థ‌నం' వెబ్ సీరిస్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. సింధూ ప‌వ‌న్, సోనియా సింగ్ న‌టించిన ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ ని శ‌నివారం రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ టీజ‌ర్ యూత్ ని ఆక‌ట్టుకునేలా ఉంది. చదువు రాణి సరస్వతి, శశి, లక్ష్మి కటాక్షం లేని మదన్ ల  దాగుడుమూతలు చూద్దాము రారండి అంటూ ఈ టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. 

క్యారెక్ట‌ర్స్ ని ప‌రిచ‌యం చేస్తూ.. 

టీజ‌ర్ ని భ‌లే కొత్త‌గా ప్లాన్ చేశారు. హీరో హీరోయిన్ ఇద్ద‌రు మాట్లాడుకుంటుంటే వాళ్ల క‌ళ్లు మాత్ర‌మే చూపించారు. "మా ఇంట్లో అంద‌రం 10 రోజులు ఫంక్ష‌న్ కి వెళ్తున్నాం" అని చెప్తూ.. సిరీస్ లోని మెయిన్ క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేసేశారు. అలా ప‌రిచ‌యం చేస్తూ వాళ్లు పెట్టిన కొన్ని డైలాగులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఆ డైలాగులు, క్యారెక్ట‌ర్లు చూస్తే ఇది కామెడీ, రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అని అర్థం అవుతుంది. హీరోయిన్ త‌ల్లి, తండ్రి, త‌మ్ముడు, తాత అంద‌రూ కామెడీగానే అనిపించారు. ఇక హీరోయిన్ అత్త మాత్రం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్. "మీ ఇంట్లో అంద‌రినీ పంపించి నువ్వు వెళ్లొచ్చు" గా అని హీరోయిన్ ని ముద్దుగా హీరో అడుగుతాడు. ప్రాబ్ల‌మ్ ఏం అవ్వ‌దా?  మీ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తావు?" అని అడుగుతుంది. 

హీరో డైలాగులు సూప‌ర్.. 

క‌ట్ చేస్తే "మా ఇంట్లో వాళ్ల‌ను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు" అంటూ హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో కూడా కుటుంబాన్ని ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్బంగా హీరో చెప్పే డైలాగులు ఆక‌ట్టుకున్నాయి. "తండ్రి కోడి కూర అడిగితే.. కూతురు ఆకుకూర అడుతుందా?", "బాబు ఓడ ఎక్కితే కూతురు దూడ ఎక్కుతుందా?", "తండ్రి గుణ‌పం అయితే కూతురు బ‌ల‌పం అవుతుందా?" అంటూ చెప్పిన ఫ‌న్నీ డైలాగ్స్ ని అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. క‌ట్ చేస్తే హీరో హీరోయిన్ కోసం చాలా దూరం ప్ర‌యాణం చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు టీజ‌ర్ లో. 

జులై4న స్ట్రీమింగ్.. 

సింధూ ప‌వ‌న్, సోనియా సింగ్ కాంబినేష‌న్ లో గ‌తంలో కూడా చాలానే మంచి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు వ‌చ్చాయి. దీంతో వీళ్ల‌ద్ద‌రి కాంబినేష‌న్ అంటే క‌చ్చితంగా హిట్ అనే అంచ‌నాలో ఉన్నారు ప్రేక్ష‌కులు. ఇక ఈ సిరీస్ జులై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొద‌టి ఎపిసోడ్ ఫ్రీ గా ల‌భించ‌నుంది. ఇక ఈ సిరీస్ కి వినోద్ గాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. హ‌రీశ్ కోహిర్క‌ర్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సింజిత్ ఎర్ర‌మిల్లి మ్యూజిక్, రెహాన్ షేక్ డీవోపీ. ఇక ఈ సిరీస్ లో అంద‌రూ వెబ్ సీరిస్ లో న‌టించే వారే ఉన్నారు. 

Also Read: పవన్ కళ్యాణ్‌కి వదినమ్మ ప్రత్యేకమైన బహుమతి - చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌, ఆకట్టుకుంటున్న వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Embed widget