అన్వేషించండి

Valari: మునుపెన్నడూ చూడని హారర్‌ అంశాలతో ‘వళరి’ - ఫస్ట్ లుక్ రిలీజ్

Valari Movie First Look: రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ హారర్ చిత్రం ‘వళరి’ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.

Valari Movie First Look: ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లను తెరకెక్కిస్తూ ఈటీవీ విన్ ముందుకెళ్తోంది. ఇక తాజాగా ఒక హారర్ సినిమాను కూడా ఈటీవీ విన్ నిర్మించనున్నట్టు ప్రకటించింది. మునుపెన్నడూ చూడని హారర్ అనే పేరుతో టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘వళరి’ అనే టైటిల్‌తో ఈ హారర్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మృతికా సంతోషిని ‘వరళి’కి దర్శకత్వం వహిస్తున్నారు.

థ్రిల్ రైడ్‌కు సిద్ధంగా ఉండండి..
‘మునుపెన్నడూ చూడని హారర్ జర్నీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. వళరి అంటే కేవలం భయపెట్టే సీన్స్ మాత్రమే కాదు.. ఇదొక మతిపోగొట్టే, గుండెను గట్టిగా కొట్టుకునేలా చేసే డిఫరెంట్ కథ. ఈ ఏడాదిలోని థ్రిల్ రైడ్‌కు సిద్ధంగా ఉండండి’ అంటూ ఈటీవీ విన్.. ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌లో రితికా సింగ్ కర్రసాము చేస్తూ కనిపిస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాత బంగ్లా కనిపిస్తుంది. దాంతో పాటు తన మొహం కూడా ఈ పోస్టర్‌లో సగమే చూపిస్తున్నారు. ఇక పోస్టర్‌ను బట్టి చూస్తే.. ‘వళరి’ మంచి హారర్ మూవీలాగా ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని నెటిజన్లు భావిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

లేడీ ఓరియెంటెడ్ హారర్ చిత్రం..
‘వళరి’లో రితికా సింగ్‌తో పాటు సుబ్బరాజు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మృతికా సంతోషిని.. ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుంది. ఇప్పటికే రితికా సింగ్.. తన కెరీర్‌లో రాఘవ లారెన్స్‌తో కలిసి ‘శివలింగ’ అనే హారర్ మూవీలో నటించింది. కానీ తనే ముఖ్య పాత్ర పోషిస్తూ.. మొదటిసారిగా ఒక లేడీ ఓరియెంటెడ్ హారర్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం తను సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘వెట్టాయన్’లో కీలక పాత్రలో కనిపిస్తోంది. తన సినిమాలు యావరేజ్‌గా హిట్ అవుతున్నా కూడా రితిక్ చేతిలో ప్రస్తుతానికి పెద్దగా అవకాశాలు లేవు. ఇప్పటికే ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన రితికా.. మరోసారి ఓటీటీ కంటెంట్‌నే నమ్ముకుంటోంది.

‘సాలా కడూస్’తో ఎంట్రీ.. 
ప్రొఫెషనల్ బాక్సర్ అయిన రితికా సింగ్.. ‘సాలా కడూస్’ అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. మొదటి సినిమాలోనే తను ప్రొఫెషనల్ యాక్టర్ కూడా అనిపించేలా చేసింది. దీంతో తనకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ‘సాలా కడూస్’ చిత్రాన్ని తెలుగు రీమేక్‌ అయిన ‘గురు’లో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనకు ఏడాదికి ఒక సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమాలు కూడా హిట్ అవుతూనే వచ్చాయి. అయినా తనకు హీరోయిన్‌గా తగినంత గుర్తింపు దక్కలేదు. దీంతో గతేడాది ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ కంటెంట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరోసారి ఈటీవీ విన్‌లో విడుదలవుతున్న ‘వళరి’ అనే హారర్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 

Also Read: 'గుంటూరు కారం' రివ్యూస్‌పై 'దిల్‌' రాజు ఫస్ట్‌ రియాక్షన్‌ - ఏమన్నారంటే..

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget