అన్వేషించండి

Premalu OTT: ‘ప్రేమలు’ మూవీకి స్పాయిలర్స్ దెబ్బ - అంత గొప్పగా ఏం లేదంటున్న ఓటీటీ ప్రేక్షకులు, కారణాలివే!

Premalu: మలయాళం మూవీ ‘ప్రేమలు’ థియేటర్లలో ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది. కానీ అదే మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంత పాజిటివ్ టాక్ అందుకోవడం లేదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పాయిలర్సే కారణం.

Premalu Movie: ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వగానే దానిలో నుంచి ముఖ్యమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని వల్ల సినిమాలపై నెగిటివ్ ప్రభావం పడుతోంది. ‘ప్రేమలు’ విషయంలో కూడా అదే జరిగింది. మీమ్స్‌, రీల్స్‌లో ఎక్కడ చూసినా ప్రేమలు మూవీ క్లిప్స్ ఉంటున్నాయి. మూవీలో కీలకమైన సీన్స్‌ అన్నీ సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ క్లిప్స్ మూవీపై అంచనాలు పెంచినా.. ముందుగానే సీన్స్ చూసేయడం వల్ల ప్రేక్షకులకు ఆ ఫీల్ రావడం లేదనేది టాక్. అందుకే థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ‘ప్రేమలు’.. ఓటీటీలో విడుదల అవ్వగానే చాలామంది దీనిని ఓవర్ రేటెడ్ అంటున్నారు.

ఒకట్రెండు సీన్స్ వల్లే..

‘ప్రేమలు’ ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. అంతకు మించి ఆ సినిమా నుంచి ఏది ఎక్కువగా ఆశించకూడదు. అయినా కూడా ఒక రిఫ్రెషింగ్ సినిమాగా ‘ప్రేమలు’ చాలామందిని ఆకట్టుకుంది. మలయాళ మేకర్స్‌కు అసలు ఈ మూవీని తెలుగులో విడుదల చేసే ఆలోచనే లేకపోయినా ప్రేక్షకుల రెస్పాన్స్‌ను చూసి తెలుగు నిర్మాతలు డబ్బింగ్ రైట్స్ కోసం క్యూ కట్టారు. అలా చాలారోజుల వెయిటింగ్ తర్వాత ‘ప్రేమలు’ తెలుగులో విడుదలయ్యింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఈ మూవీలోని కీలకమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ మొత్తం బయటకు వచ్చేశాయి. దీంతో థియేటర్లకు వెళ్లి ‘ప్రేమలు’ చూడని ఆడియన్స్ అంతా ముందుగానే ఆ సీన్స్ చూసేయడం వల్ల.. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌కు కనెక్ట్ కాలేకపోతున్నారు. క్లైమాక్స్ ముందుగానే తెలిసిపోవడం వల్ల.. భావోద్వేగ సన్నివేశాలకు కనెక్ట్ కాలేకపోెతున్నారు. అందుకే, అంతా సోసోగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్..

థియేటర్లలో ఒక సినిమా విడుదల అవ్వడం.. పెద్ద స్క్రీన్‌పై దానిని విజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వారికి అది విపరీతంగా నచ్చడం.. చివరికి ఓటీటీలో విడుదల అవ్వగానే దానిని ఓవర్ రేటెడ్ అంటూ విమర్శించడం.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే తంతు కొనసాగుతోంది. గత కొన్ని నెలల్లో థియేటరల్లో బ్లాక్‌బస్టర్ అయిన పలు సినిమాలు.. ఓటీటీలోకి రాగానే ఓవర్ రేటెడ్ అంటూ నెగిటివ్ కామెంట్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందులో ‘ప్రేమలు’ కూడా ఒకటి. అంతే కాకుండా దీనికి రివర్స్‌లో కూడా జరుగుతోంది. ఒక మూవీ థియేటర్లలో విడుదలయిన మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అంటూ ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. అలా ఓటీటీలో వచ్చిన సినిమా చూసి దానికి అండర్ రేటెడ్ అనే ట్యాగ్‌ను తగిలిస్తున్నారు.

‘గామి’పై ఎఫెక్ట్..

‘ప్రేమలు’ థియేటర్లలో రన్ అవుతున్న సమయంలోనే ‘గామి’ కూడా విడుదలయ్యింది. మొదట్లోనే ‘గామి’కి మిక్స్‌డ్ టాక్ రావడంతో అందరూ ‘ప్రేమలు’కే ఓటేశారు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ‘ప్రేమలు’ ఓవర్ రేటెడ్ అని, ‘గామి’ అండర్ రేటెడ్ అని అనడం మొదలుపెట్టారు చాలామంది ప్రేక్షకులు. సినిమాలోని కీలకమైన సీన్స్ అన్నీ సోషల్ మీడియాలో బయటికి రావడం వల్ల సినిమాలకు చాలా నష్టం జరుగుతుందని, అందుకే ఒక మూవీని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవారు దానిని వీడియోలు తీయకుండా ఉంటే బాగుంటుందని మరికొందరు మూవీ లవర్స్ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అందుకున్న ‘ప్రేమలు’.. ఓటీటీలోకి వచ్చాక మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది.

Also Read: నెల రోజుల ముందే ఓటీటీకి వచ్చేస్తోన్న 'టిల్లు స్క్వేర్‌'? - ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే!

టాప్ హెడ్ లైన్స్

Aditya Devulapally: 'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget