OG OTT: ఇట్స్ అఫీషియల్... పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
OG OTT Platform: పవన్ కల్యాణ్ రీసెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Pawan Kalyan's OG Movie OTT Release On Netflix: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG'. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. తాజాగా 'OG' ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'OG' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 23 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ఒకప్పుడు ముంబైలో వచ్చిన తుపాను మళ్లీ తిరిగి వస్తోంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.
'OG' రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్‌గా రూ.308 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మూవీ టీం అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పవన్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్ ఆయన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలానే సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. 'ఓజాస్ గంభీర'గా పవన్ జోష్, గ్రేస్, ఎనర్జీ వేరే లెవల్. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వింటేజ్ పవర్ స్టార్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
View this post on Instagram
Also Read: గుప్త నిధుల కోసం వేట... రక్తం తాగే రాక్షసత్వం - ఈ 'ధన పిశాచి'ని చూడాలంటే ధైర్యం కావాల్సిందే...
పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు. థియేటర్స్‌లో రికార్డులు సృష్టించగా... ఓటీటీలోనూ అంతే స్థాయిలో ట్రెండ్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
సత్య దాదా (ప్రకాష్ రాజ్) కనుసన్నల్లోనే ముంబయి కొలాబా పోర్టు ఉంటుంది. ఆ పోర్టు మీదుగా వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌ను సత్య దాదా కొడుకు అడ్డుకోగా అతన్ని ఓ ముఠా చంపేస్తుంది. దీంతో ఆ కంటైనర్‌ను ఎవరికీ తెలియకుండా దాచేస్తాడు సత్య దాదా. ఒకప్పుడు పోర్టును ఆక్రమించుకోవాలని ఫెయిల్ అయిన మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) పెద్ద కొడుకు ఆ కంటైనర్ కోసం రంగంలోకి దిగుతాడు. దీంతో సత్య దాదాతో పాటే అతని ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది.
ఆ ముఠాను అడ్డుకునేందుకు సత్య దాదా పెంచిన కొడుకు గంభీర (పవన్ కల్యాణ్) ఎంటర్ అవుతాడు. అసలు గంభీర ఎవరు? సత్యదాదాకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? అతనికి గంభీర ఎందుకు దూరమయ్యాడు? కణ్మని పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















