News
News
X

Nandamuri Balakrishna: ఇంట్లో వసుంధరే అన్‌స్టాపబుల్‌’, నా మనవళ్లు నన్ను తాత అనరు: బాలయ్య ఆసక్తికర కామెంట్స్

Nandamuri Balakrishna Speech: బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం వసుంధరే అన్‌స్టాపబుల్‌ అన్నారు నందమూరి బాలకృష్ణ. నన్ను భరిస్తున్నారని... కుటుంబాన్ని లీడ్ చేస్తున్నారన్నారు.

FOLLOW US: 

Nandamuri Balakrishna Speech: గ్లోబల్‌ టాప్‌ టెన్ టాక్‌షోలో అన్‌స్టాపబుల్‌ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు బాలయ్య. మొదటి నుంచి ఏదో అద్భుతం జరగబోతుందని అనుకున్నామన్నారు. ప్రోగ్రామ్‌కు వచ్చే గెస్ట్‌లలో చాలా మంది రిజర్వర్డ్‌గా ఉంటారని... వాళ్లు షో కోసం  వచ్చామని మర్చిపోయి విషయాలు రాబట్టాలన్నారు. ఇప్పుడు అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 కూడా మొదటి సీజన్‌కు అమ్మమొగుడులా నిలబడాలని కోరుకుంటున్నాను అన్నారు. 

కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇది నాన్నగారి నుంచి వస్తోంది. కొత్త కొత్త హీరోలు టీవీల్లో కనిపిస్తున్నారు.. బాలయ్య కనిపించడేంటని అనుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. టీవీల్లో కనిపించలేనని చాలా మంది అనుకొని ఉంటారు. దేనికైనా సమయం సమాధానం చెబుతుంది. 

ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు అల్లు అరవింద్‌ గురించి మాట్లాడాలి. ముందు నుంచే అల్లు రామలింగయ్యతో తమ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. ఇంట్లో సభ్యుడిగా ఆయనకు మా ఇంట్లో చనువు ఉండేదన్నారు. అదే చనువుతో తనను అడిగితే ఈ కార్యక్రమానికి అంగీకరించాను అన్నారు. 

ఇలాంటి ప్రోగ్రామ్స్‌ చేయాలంటే... జనంతో మమేకం అవ్వాలి. మనిషికి సంబంధించిన రకరకాల కోణాలు ఆవిష్కరించాలంటే అది చాలా అవసరం. అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ప్రపంచం చిన్నది అవుతోంది. అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకోవాలి. విజయాలు వస్తే ఆనందించడమే కాదు.. పరాజయాన్ని కూడా అంతే స్ఫూర్తితో తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి. ఎన్టీఆర్‌ చాలా ముందు చూపుతో సినిమాలు తీసేవాళ్లు. అందులో చాలా ఫెయిల్ అయ్యాయి. కానీ ఆయన ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. 

News Reels

అఖండ, అన్‌స్టాపబుల్‌ రెండూ మంచి విజయాన్ని అందించాయన్నారు బాలయ్య. కరోనా తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. మంచి టీం కలయికతోనే ఇది సాధ్యమైంది. నటన అంటే నవ్వడం, అరవడమే కాదు.. ఓ పరకాయ ప్రవేశం, ఓ ఆత్మలోకి ప్రవేశించాలి. అలానే ఈ అవకాశం రావడం అది విజయవంతం అవ్వడం  చాలా సంతోషంగా ఉంది. 

కచ్చితంగా మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఏమీ ఆశించకుండా అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం. సినిమాలు చేసుకుంటూ ఈ మాధ్యమంలోకి అడుగు పెట్టాను. ఇందులో ముందు ముందు చాలా అద్భుతాలు రాబోతున్నాయి. దీని కోసం అందరూ అందించిన సహకారాన్ని మర్చిపోలేం. ఇలా అందరి కలయికే ఈ అన్‌స్టాపబుల్‌. నేను అడుగు పెట్టిన ఈ మాధ్యమంలో నా ప్రయత్నాని విజయాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు. 

బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం వసుంధరే అన్‌స్టాపబుల్‌ అన్నారు నందమూరి బాలకృష్ణ. నన్ను భరిస్తున్నారని... కుటుంబాన్ని లీడ్ చేస్తున్నారన్నారు. సినిమాలు, హాస్పిటల్‌ విషయంలో తాను బిజీగా ఉంటే మిగతా విషయాలు తను చూసుకుంటారన్నారు. అందుకే ఇంట్లో ఆమె అన్‌స్టాపబుల్ అన్నారు. 

తనది మూల నక్షత్రం, అమ్మవారిది మూల నక్షత్రమన్నారు. దుర్గ వివిధ రూపాలను పూజిస్తానన్నారు. నిస్వార్థంగా నాకు ఇది కావాలని ఎప్పుడూ అడగలేదని నాన్న చెప్పినట్టు అందరూ బాగుండాలని, చలనచిత్రరంగం, మేం తీసే సినిమాల్లో ప్రజలకు సందేశాలు ఇవ్వడం వాటి ప్రభావం వారిపై ఉండాలని కోరుకున్నట్టు వెల్లడించారు. 

నాన్న నటించిన సినిమాల్లో చాలా వాటిలో ఆయన అన్‌స్టాపబుల్‌. ఆయనే నాకు స్ఫూర్తి ప్రదాత. ఆయనే గురువు. తర్వాత ప్రేక్షకులే నాకు డ్రైవింగ్ ఎనర్జీ. ప్రజలు కోరుకునేదాని కంటే పది అడుగులు ముందు ఉండాలి. ప్రయత్నం చిత్తశుద్ధితో చేసినప్పుడు సినిమాలు విజయం చెందుతాయి. అన్నింటికంటే ముఖ్యం నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను. ఎప్పుడూ ఏదో వ్యాపకంతో ప్రజాసేవకు అంకితమవ్వాలని నాన్ని చెప్పేవాళ్లు. అదే పాటిస్తున్నానన్నారు. 

మూవీ టీం ఇష్టమా... ఆహా టీం ఇష్టమా అంటే... అందరూ ఇష్టమేనన్నారు బాలయ్య.  ఈ షోకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు. వాళ్ల టైం బట్టి వస్తారన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు సినిమా షూటింగ్‌లానే ఫీల్‌ అయ్యానన్నారు. ఈ క్రెడిట్‌ అంతా ఆ టీంకు ఇవ్వాలన్న బాలయ్య... అన్ని విధాలుగా సహకరించారని వివరించారు. సమయాన్ని వృథా చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. చివరిగా యాంకర్ ‘‘మిమ్మల్ని నేను మావయ్యా అని పిలవచ్చా?’’ అని అడిగింది. ఇందుకు బాలయ్య సమాధానం ఇస్తూ.. ‘‘మా ఇంట్లో నా మనవళ్లే నన్ను మావయ్య అని పిలవరు. నన్ను బాలా అని పిలుస్తారు’’ అని సమాధానం ఇచ్చారు. 

Published at : 04 Oct 2022 09:53 PM (IST) Tags: Nandamuri Balakrishna Speech dussehra 2022 Unstoppable with NBK season 2 Balakrishna Chat Show

సంబంధిత కథనాలు

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు - 78 ఏళ్ల వయసులో ఏంటిలా?

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు - 78 ఏళ్ల వయసులో ఏంటిలా?

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

Intinti Ramayanam Release Date : 'ఇంటింటి రామాయణం' - పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది?

Intinti Ramayanam Release Date : 'ఇంటింటి రామాయణం' - పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది?

Aha Naa Pellanta Web Series : 'అహ నా పెళ్ళంట' @ 83333 ప్లస్ గంటలు

Aha Naa Pellanta Web Series : 'అహ నా పెళ్ళంట' @ 83333 ప్లస్ గంటలు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు