By: ABP Desam | Updated at : 14 Mar 2023 08:04 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Mrunal Thakur/Instagram
తెలుగులో దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు యూత్ ఫిదా అయిపోయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అందర్నీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ యువతి ఓ చిక్కులో పడింది. ఆమె వ్యక్తిగత వివరాలు, షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన ఈ-మెయిల్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇటీవల మృణాల్ ఠాకూర్ వెకేషన్ కు వెళ్లింది. అయితే అక్కడ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. తన మేనేజర్ ఫోన్ చేసిందని, తన ఈ-మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పిందని చెప్పింది. తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ అలాగే కాంట్రాక్ట్ వివరాలు అన్నీ ఆ మెయిల్ లో ఉన్నాయని, ఇప్పుడా మెయిల్ ను హ్యాక్ చేశారని చెప్పింది. తనకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదని తెలిపింది. అయితే, ఆ వీడియో చూసినవారు.. కాసేపు అది నిజమని నమ్మేశారు. ఇంతలోనే ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
తాను ఈ సమస్య నుంచి బయట పడేందుకు రానా సాయం చేశాడని చెప్పడంతో అసలు విషయం అర్థమైంది. ‘‘నా సమస్య గురించి రానా నాయుడుకు ఫోన్ చేశానని చెప్పింది. కొద్దిసేపటికి ఆ హ్యాకర్ నుంచి ఫోన్ వచ్చిందని, వీడియో చూడండి అని చెప్పి ఆ హ్యాకర్ ఫోన్ కట్ చేశాడని తెలిపింది. ఆ వీడియోలో హ్యాకర్ తనకు క్షమాపణలు చెప్పాడని చెప్పింది. ‘రానా నాయుడు’ వెంటనే సాయం చేయడం వలన సేఫ్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాను ప్రశాంతంగా హాలిడే ఎంజాయ్ చేస్తున్నాను అని, మీరు కూడా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా కేవలం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం మృణాల్ చేసిన ప్రమోషన్ వీడియో అని తెలిసి ఆమె ఫాలోవర్లు ఆమెను తిట్టుకుంటున్నారు. ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - నందమూరి తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
ఇక ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా కనిపించారు. ఈ సిరీస్ విడుదలకు ముందు నుంచీ వినూత్నంగా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. గతంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో రానా కిడ్నాప్ డ్రామాతో కొత్తగా ప్రమోషన్స్ చేశారు. తర్వాత కమెడియన్ బ్రహ్మానందంతో ఓ ప్రమోషన్స్ వీడియో చేసి ప్రచారం చేశారు. తాజాగా మృణాల్ తో సరికొత్తగా మరోసారి ప్రచారం చేశారు మేకర్స్. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సిరీస్ లో బోల్డ్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో విమర్శలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది.
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Citadel Web Series Telugu: తెలుగులోనూ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ - స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే!
Rana Naidu Web Series: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి