అన్వేషించండి

Neru OTT release: ఓటీటీలోకి మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘నేరు’ - తెలుగులోనూ చూసేయొచ్చు

Neru Movie: మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో నటించిన మలయాళ చిత్రం ‘నేరు’ థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇంతలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Neru OTT Release: గతేడాది డిసెంబర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా విడుదలయిన చాలావరకు చిత్రాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. కేవలం పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే కాకుండా.. ఎన్నో ప్రాంతీయ చిత్రాలు కూడా డిసెంబర్‌లో తమ సత్తాను చాటుకున్నాయి. అందులో ఒకటి మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో నటించిన ‘నేరు’. ఈ మూవీ 2023 డిసెంబర్ 21న విడుదలయ్యింది. కేవలం మలయాళంలో మాత్రమే విడుదలయిన ‘నేరు’.. ఓవర్సీస్‌లో కూడా సత్తాను చాటుకుంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతుండడంతో ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ బయటికొచ్చింది.

జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్ హిట్..
‘నేరు’కు పోటీగా ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి. కానీ మలయాళ స్టార్ మోహన్‌లాల్ సినిమాకే ప్రేక్షకులు ఎక్కువగా ఓటు వేశారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీకి చాలామంది ఆడియన్స్.. ఫ్యాన్స్ అయిపోయారు. దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్‌కు మలయాళంలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో థ్రిల్లర్ సినిమా వస్తుందంటే చాలు.. చాలామంది ప్రేక్షకులు ఆసక్తికర ఎదురుచూడడం మొదలుపెడతారు. అలా ‘నేరు’పై కూడా అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఈ మూవీ ఏ మాత్రం తగ్గకపోవడంతో కలెక్షన్స్ విషయంలో కూడా సినిమా దూసుకుపోయింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘నేరు’ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అప్డేట్ అందించారు.

మలయాళంతో పాటు ఇతర భాషల్లో..
జనవరి 23 నుంచి ‘నేరు’ చిత్రం హాట్‌స్టార్‌లోకి అందుబాటులోకి రానుంది. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్‌లాల్‌తో పాటు లీడ్ రోల్‌లో నటించింది అనస్వరా రాజన్. వీరితో పాటు ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాంతీ మాయాదేవి.. ‘నేరు’కు సహ రచయితగా పనిచేయడంతో పాటు సినిమాలో చిన్న రోల్‌ కూడా ప్లే చేసింది. ఇక ‘నేరు’ కలెక్షన్స్ వివరాలు చూసి ఇతర భాషా ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

రూ.100 కోట్ల కలెక్షన్స్..
కేవలం కేరళలోనే దాదాపు రూ.50 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది ‘నేరు’. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుకుంది. అందుకే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. మాలీవుడ్‌లో యంగ్ హీరోల సంగతి పక్కన పెడితే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. అందులో వారి యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోలు అయిన మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి నటులు ఇంకా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తున్నారని మలయాళ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ‘నేరు’లాంటి థ్రిల్లర్ కథతో మోహన్‌లాల్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘కాథల్’లాంటి ఎమోషనల్ కథతో మమ్ముట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వయసులో కూడా సినిమాలపై మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి నటులు చూపిస్తున్న డెడికేషన్ చూసి మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: వదిలేయాలనే ఆలోచన లేదు - బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో రిలేషన్‌షిప్‌పై తాప్సీ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Akka Web Series Review - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
Crime Thriller OTT : రెండు ఓటీటీల్లోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రెండు ఓటీటీల్లోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget