అన్వేషించండి

Squid Game Season 2: ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2కు టైమ్ వచ్చేసింది - స్పెషల్ గ్లింప్స్‌తో మేకర్స్ ప్రకటన

Squid Game Season 2: ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన మరో రెండు సీజన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని మేకర్స్ ప్రకటించారు.

Squid Game Season 2 Release Date: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌లకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఇప్పుడు సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఉంది. పైగా ఎంతో హైప్‌తో ఒక వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన తర్వాత దాని ఫస్ట్ సీజన్ సక్సెస్ అయితే తర్వాత సీజన్స్‌కు భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు అలాంటి సిరీస్‌ల లిస్ట్‌లోకి ‘స్క్విడ్ గేమ్’ వచ్చి చేరింది. నాలుగేళ్ల క్రితం విడుదలయిన ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన రెండో, మూడో సీజన్స్‌కు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

స్పెషల్ గ్లింప్స్..

‘స్క్విడ్ గేమ్’ రెండో సీజన్ 2024 డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా మూడో సీజన్.. అంటే ఫైనల్ సీజన్ కూడా 2025లో రానుందని తెలిపారు. ఈ విషయాన్ని ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ అయిన హ్వాంగ్ డాంగ్ హ్యోక్ ఒక ఎమోషనల్ లెటర్‌తో బయటపెట్టారు. అంతే కాకుండా దీనికోసం ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అందులో ముందుగా ఒక రన్నింగ్ రేస్ ట్రాక్‌పై చాలామంది ప్లేయర్స్ సిద్ధంగా ఉంటారు. అలా వారందరూ పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఆ ట్రాక్‌పైకి స్క్విడ్ గేమ్ ప్లేయర్స్ వస్తారు.

ఎన్నో రికార్డులు..

‘‘మూడేళ్ల అయిపోయింది. మళ్లీ ఆట ఆడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’’ అనే డైలాగ్‌తో ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ వీడియో ముగుస్తుంది. ఈ సిరీస్ ద్వారా బెస్ట్ డైరెక్టర్‌గా ప్రైమ్‌టైమ్ ఎమ్మీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు హ్వాంగ్ డాంగ్ హ్యోక్. ఈ ఘనతను దక్కించుకున్న మొదటి ఏషియన్‌గా రికార్డ్ సాధించారు. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఈ సిరీస్.. అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక మొదటి సీజన్ లాగానే రెండో సీజన్‌లో కూడా లీ జుంగ్ జే, లీ బ్యుంగ్ హూన్, వీ హా జున్, గాంగ్ యో.. కీలక పాత్రల్లో నటించనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరెందరో పాత నటీనటులు సెకండ్ సీజన్‌తో తిరిగిరానున్నారు.

అసలైన ఆట..

‘‘అసలైన ఆట మొదలవుతుంది. సీజన్ 1తో ప్రపంచవ్యాప్తంగా మాకు ఊహించని స్పందన లభించింది. ఎన్నో ఊహించలేని ఈవెంట్స్‌లో కూడా పాల్గొన్నాం. సీజన్ 2,3కు సంబంధించిన డేట్‌ను అనౌన్స్ చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నేను మళ్లీ స్క్విడ్ గేమ్ ప్రపంచంలో అడుగుపెడుతున్నాననే విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మూడేళ్ల తర్వాత ఈ గేమ్‌లోకి తిరిగిరావడం మీకు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. స్క్విడ్ గేమ్ అనే విత్తనం పెద్ద చెట్టుగా మారి పండును అందించడం చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కచ్చితంగా దీంతో మరో థ్రిల్ రైడ్‌ను అందిస్తామని మాటిస్తున్నాను’’ అని దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యోక్ తెలిపారు.

Also Read: అదిరిపోయే యాక్షన్, ఆహా అనిపించే రొమాన్స్- ‘సిటాడెల్’ టీజర్‌లో సమంతను చూస్తే మతిపోవాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget