Oppenheimer OTT: ఓటీటీలోకి ఆస్కార్ విన్నర్ ‘ఓపెన్‌హైమర్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Oppenheimer OTT Release: క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపింది జియో సినిమా.
Oppenheimer OTT Release Date: హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు అంటే కేవలం ఇంగ్లీష్ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ ఇష్టమే. క్రిస్టోఫర్ నోలాన్ టేకింగ్‌ను దర్శకులు కావాలని కలలు కనేవారు అందరూ అభిమానిస్తారు. ఒక్కొక్క సినిమాకు చాలా గ్యాప్ తీసుకునే నోలాన్.. తాజాగా ‘ఓపెన్‌హైమర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆస్కార్స్ వరకు వెళ్లింది. 96వ ఆస్కార్స్ అవార్డుల వేడుకలో పలు కేటగిరిల్లో పురస్కారాలు అందుకుంది. దీంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది ‘ఓపెన్‌హైమర్’. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలి అనుకునేవారికి మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు.
ఫ్యాన్స్ హ్యాపీ..
క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు అనేవి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. అందుకే ‘ఓపెన్‌హైమర్’ను చాలామంది థియేటర్లలో చూడడానికి ఇష్టపడ్డారు. కానీ థియేటర్లలో ఈ సినిమాను చూడడం మిస్ అయినవారికి, ఓటీటీ చూడాలని ఎదురుచూస్తున్న వారికి తాజాగా గుడ్ న్యూస్ తెలిపారు మేకర్స్. మార్చి 21న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. జియో సినిమా.. ‘ఓపెన్‌హైమర్’ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇక ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి జియో సినిమానే సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించింది. దీంతో క్రిస్టోఫర్ నోలాన్ ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇంగ్లీష్‌తో పాటు హిందీలో..
‘‘మీ ప్రపంచం మొత్తం మారనుంది. మార్చి 21 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా జియో సినిమాలో ‘ఓపెన్‌హైమర్’ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమ్ కానుంది’’ అంటూ జియో సినిమా.. సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఈ న్యూస్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. మార్చి 21న జియో సినిమాలో ‘ఓపెన్‌హైమర్’ను ఫ్రీగా వీక్షించే అవకాశం ఉన్నా.. రెంట్‌తో అయినా చూడాలి అనుకున్న వారికోసం అమెజాన్ ప్రైమ్, బుక్ మై షో ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సిలియన్ మర్ఫీ హీరోగా నటించిన ఈ చిత్రం రాబర్ట్ ఓపెన్‌హైమర్ అనే సైంటిస్ట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. ఆయన ‘ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్’ అని కూడా పిలుస్తారు. అటామిక్ బాంబ్ తయారీలో శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారు. అందులో ఓపెన్‌హైమర్ పాత్ర ఏంటి అనేదానిపై సినిమా కథ ఆధారపడుతుంది. వరల్డ్ వార్ 2 సమయంలోని సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.
ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు..
96వ ఆస్కార్ అవార్డులలో 13 కేటగిరిల్లో స్థానం దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ‘ఓపెన్‌హైమర్’. ఆస్కార్స్ కంటే ముందే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఈ సినిమా సొంతమయ్యాయి. లండన్‌లోని బఫ్తా ఫిల్మ్ అవార్డులలో ఏడు కేటగిరిల్లో విన్నర్‌గా నిలిచింది ‘ఓపెన్‌హైమర్’. ఇక 2024లోని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో కూడా 8 పురస్కారాలను గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్‌లో సైతం అయిదు నామినేషన్స్‌తో పోటీపడగా.. అందులో అయిదు అవార్డులను గెలుచుకుంది. సిలియన్ మార్ఫికి హాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్నా.. క్రిస్టోఫర్ నోలాన్‌తో ‘ఓపెన్‌హైమర్’ కోసం మొదటిసారి చేతులు కలిపాడు. ఓపెన్‌హైమర్ పాత్రలో ఒదిగిపోయి అందరినీ మెప్పించాడు.
Also Read: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై నాటు నాటు - ఇండియన్స్‌కు మరోసారి ప్రైడ్ మూమెంట్!