Dhootha Web Series: తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్, ఎందుకంటే?
బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్ తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నారు. నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే...
బాలీవుడ్ బ్యూటీ తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే... ఇప్పుడు ఆమె ఒక తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే... అది సినిమా కాదు, వెబ్ సిరీస్. ఆ సిరీస్ షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు.
అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న వెబ్ సిరీస్ 'దూత'. ఆయనతో 'మనం' వంటి క్లాసిక్ ఫిల్మ్ తీసిన విక్రమ్ కె. కుమార్ ఈ సిరీస్‌కు దర్శకుడు. ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందుతోంది. ఇందులో ప్రాచి దేశాయ్ నటిస్తున్న సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు అమెజాన్ ప్రైమ్ తెలియజేసింది.
Also Read: అప్పులు అన్నీ తీరుస్తా, కడుపు నిండా తింటా - కమల్ హాసన్
ఇప్పుడు ప్రాచి దేశాయ్ హైదరాబాద్ వచ్చారు. నాగ చైతన్య, విక్రమ్ కె. కుమార్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు. తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ తదితరులు నటిస్తున్నారు.
Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట
View this post on Instagram
View this post on Instagram